Aamir Khan: ఆ ట్రెండ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టే ప్లాన్‌లో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో
ప్రజెంట్ సినిమా మార్కెట్‌ను ఓటీటీలే శాసిస్తున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని సినిమాల రిలీజ్‌లు, ప్రమోషన్ల విషయంలోనూ ఓటీటీల పెత్తనమే కనిపిస్తోంది. అందుకే ఈ ట్రెండ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టే ప్లాన్‌లో ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. ఎలా అనుకుంటున్నారా..? ఈ స్టోరీలో చూద్దాం. ప్రజెంట్ సినిమా మార్కెట్‌ను ఓటీటీలే శాసిస్తున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని సినిమాల రిలీజ్‌లు, ప్రమోషన్ల విషయంలోనూ ఓటీటీల పెత్తనమే కనిపిస్తోంది. అందుకే ఈ ట్రెండ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టే ప్లాన్‌లో ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. ఎలా అనుకుంటున్నారా..? ఈ స్టోరీలో చూద్దాం.
Updated on: May 29, 2025 | 8:30 PM

సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్. బ్లాక్ బస్టర్ మూవీ తారే జమీన్ పర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుస ఫెయిల్యూర్స్ తరువాత ఎలాగైన సక్సెస్ ట్రాక్‌లోకి రావాలన్న కసితో ఈ సినిమాను తెర మీదకు తీసుకువస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు ఆమిర్ ఖాన్.

థియేట్రికల్ రిలీజ్ తరువాత ఓటీటీలకు వెళ్లకుండా సినిమాను యూట్యూబ్‌లో పే పర్ వ్యూ పద్దతిలో స్ట్రీమ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రజెంట్ సినిమా మార్కెట్‌తో పాటు ప్రొడక్షన్ ప్లానింగ్‌ను రిలీజ్ డేట్స్‌ను కూడా ఓటీటీ సంస్ధలే నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. అందుకే ఈ పరిస్థితికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆమిర్.

ఈ ఫార్మాట్ సక్సెస్ అయితే భవిష్యత్తులో మరికొంత మంది నిర్మాతలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.




