Sandeep Reddy Vanga: సందీప్‌ను టార్గెట్ చేశారా..? సక్సెస్‌ను భరించలేకపోతున్నారా ??
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరో బాంబు పేల్చారు. స్పిరిట్ కథను ఓ స్టార్ హీరోయిన్ లీక్ చేసిందంటూ ట్వీట్ చేశారు. ఈ మెసేజ్ ఇప్పుడు నార్త్ సర్కిల్స్‌లోనే కాదు. సౌత్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. సందీప్ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందన్న డిస్కషన్ జరుగుతోంది. సౌత్ సినిమాతో పరిచయం అయి.. ఇప్పుడు బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
Updated on: May 29, 2025 | 7:55 PM

సౌత్ సినిమాతో పరిచయం అయి.. ఇప్పుడు బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అయితే బాలీవుడ్‌లో ఎంట్రీ దగ్గర నుంచే సందీప్ మీద నెగెటివిటీ భారీ స్థాయిలో కనిపిస్తోంది. సినీ ప్రముఖుల నుంచి క్రిటిక్స్ వరకు చాలా మంది సందీప్‌ను టార్గెట్ చేశారు.

కబీర్ సింగ్ రిలీజ్ సమయంలో సందీప్‌ను టార్గెట్ చేసింది అక్కడి మీడియా. అయితే అందరిలా ఆ ట్రోల్స్‌కు భయపడకుండా తనదైన స్టైల్‌లో రిటార్ట్ ఇచ్చారు మిస్టర్ వంగా. ఆ తరువాత యానిమల్ సినిమా విషయంలోనూ ఇలాంటి విమర్శలే ఎదురయ్యాయి.

యానిమల్ సంచలన విజయం సాధించినా... సందీప్‌కు విమర్శలు మాత్రం తప్పలేదు. సినిమా యూనిట్‌లో ఎవరి గురించీ మాట్లాడకుండా... కేవలం సందీప్‌నే టార్గెట్ చేయటంతో కావాలనే ఈ దర్శకుడి మీద విమర్శలు చేస్తున్నారన్న క్లారిటీ వచ్చింది.

ఇప్పుడు స్పిరిట్ విషయంలోనూ ఇలాంటి కుట్రలే జరుగుతున్నాయి. సినిమా కథ విన్న హీరోయిన్ స్వయంగా కథను లీక్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ సిచ్యుయేషన్ కూడా తన స్టైల్‌లోనూ డీల్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా.

ఆ హీరోయిన్ పేరు చెప్పకపోయినా... డైరెక్ట్‌గా సోషల్ మీడియా వేదికగా ఆ నటిగా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతానికి సోషల్ మీడియా పోస్ట్‌లతోనే సరిపెడుతున్నా.. ముందు ముందు ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.




