AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరో, హీరోయిన్స్ లేరు..! పెట్టింది రూ. 2కోట్లు వచ్చింది రూ.40కోట్లు.. పెద్ద సినిమాలను కూడా వెనక్కి నెట్టింది.

రీసెంట్ డేస్ లో చిన్న సినిమాలు కూడా దుమ్మురేపుతున్నాయి. బడా సినిమాలు, పాన్ ఇండియా సినిమాలతో పోటీ పడుతూ కంటెంట్ ఉన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీగా కలెక్షన్స్ రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి .

స్టార్ హీరో, హీరోయిన్స్ లేరు..! పెట్టింది రూ. 2కోట్లు వచ్చింది రూ.40కోట్లు.. పెద్ద సినిమాలను కూడా వెనక్కి నెట్టింది.
Tollywood Movie
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2026 | 1:04 PM

Share

ప్రస్తుతం పాన్ ఇండియా  సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. తెలుగు సినిమాల దెబ్బకు ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇండియన్ సినిమా వైపు చూస్తుంది. పెద్ద సినిమాలే కాదు.. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాయి. ఈ మధ్య విదులైన సినిమాల్లో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలు సంచలన విజయాన్ని సాధిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలై వెయ్యికోట్లకు పైగా వసూల్ చేస్తున్నాయి. అలాగే చిన్న సినిమాలు. కథ మంచిగా ఉంటే చాలు ఇతర బాషల సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఓ సినిమా ఇప్పుడు థియేటర్స్ లోనే కానీ ఓటీటీలోనూ దుమ్మురేపింది.

అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..

ఆ సినిమా ఎదో తెలుసా..? కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఓ సినిమా ఏకంగా రూ. 40కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్, స్టార్ డైరెక్టర్స్ లేరు కానీ సినిమా సంచలన విజయం సాధించింది. పెద్ద పెద్ద సినిమాలను కూడా వెనక్కి నెట్టింది.. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? గత ఏడాది విడుదలైన సినిమాల్లో మంచి విజయాన్ని అందుకున్న సినిమా లిటిల్ హార్ట్స్..

గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..

సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో శివానీ నాగారం హీరోయిన్ గా నటించింది. రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హసన్ నిర్మాతగా మారి లిటిల్ హార్ట్స్ సినిమాను నిర్మించాడు. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్స్ లో విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఇక ఓటీటీ లోనూ ఈ సినిమా దుమ్మురేపింది.

ఇవి కూడా చదవండి

చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..