AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మానేయడానికి కారణం అదే.. అసలు విషయాన్ని చెప్పిన లేడీ కమెడియన్

నటి షబీనా తన కెరీర్, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల నుంచి వైదొలగడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వివరించింది. తన టామ్ బాయ్ వ్యక్తిత్వాన్ని పంచుకున్న షబీనా.. ఇలా చెప్పుకొచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మానేయడానికి కారణం అదే.. అసలు విషయాన్ని చెప్పిన లేడీ కమెడియన్
Jabardasth Shabeena
Ravi Kiran
|

Updated on: Jan 30, 2026 | 1:03 PM

Share

నటి షబీనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల నుంచి వైదొలగడానికి గల కారణాలను వివరించింది. యాంకర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి.. ప్రదీప్ హోస్ట్ చేసిన పెళ్లి చూపులు షో ద్వారా పాపులర్ అయింది. ఆ తర్వాత సీరియల్స్, సినిమాలు చేస్తూ జబర్దస్త్‌లోకి అడుగుపెట్టింది. ఆపై రాంప్రసాద్, సుధీర్ టీంలలో పలు స్కిట్స్ చేసింది షబీనా. అటు కెవ్వు కార్తీక్ టీం, డైరెక్టర్ శ్రీపాదతో కలిసి చేసిన స్కిట్స్ తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయని షబీనా పేర్కొంది. కొత్త కంటెంట్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్లే తాను షోల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని.. తాను గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అని, కమెడియన్‌గా నటించలేనని షబీనా పేర్కొంది.

ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

తనది టామ్ బాయ్‌ వ్యక్తిత్వం అని చెప్పిన షబీనా.. అలా ఉండడం తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. అబ్బాయిలకు ఉండే స్వేచ్ఛ, మ్యానరిజమ్స్ తనకు నచ్చుతాయని వివరించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ మణికంఠ తనకు బ్రో లాంటి వాడని, తనతో అన్నీ పంచుకునేవాడని షబీనా చెప్పింది. మణికంఠకు కుటుంబంలో ఎవరూ పెద్దగా తోడు లేరని, తల్లి మరణం తర్వాత సవతి తండ్రి, సవతి సోదరితో సంబంధాలు సరిగా లేవని వెల్లడించింది. మణికంఠ ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడని, తన భార్య అమెరికాలో నివసించేదని తెలిపింది. అక్కడ వర్క్ వీసా సమస్యలు, భార్య గర్భవతి అయినప్పుడు, పాప పుట్టినప్పుడు అన్ని బాధ్యతలను మణికంఠ ఒంటరిగానే చూసుకున్నాడని, దీంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని షబీనా వివరించింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..