AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

మటన్ బోటీ రుచితో పాటు ఆరోగ్యానికీ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఐరన్, జింక్, విటమిన్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే బోటీ రక్తహీనతను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, శుభ్రపరిచే విధానం, సరైన ఉడికించడం, మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.

Mutton: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..
Mutton Boti
Ravi Kiran
|

Updated on: Jan 28, 2026 | 6:30 PM

Share

పండగలు లేదా ఆదివారాలు రాగానే మాంసాహార ప్రియుల ఇళ్లలో మటన్ ఘుమఘుమలాడాల్సిందే. మటన్ ముక్కలతో పాటు, మేక తలకాయ మాంసం, కాళ్లు, రక్తం, బోటీని చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిలో బోటీ రుచికి మాత్రమే పరిమితం కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మేక కేవలం పచ్చని ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి, దాని పేగుల్లో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బోటీ వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అనేకమున్నాయి. మేక పేగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఇది ఒక మంచి ఆహార వనరు. అంతేకాకుండా, చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా బోటీ మేలు చేస్తుంది.

ఇది చదవండి: హీరోయిన్లు అందరూ శోభన్ ‌బాబు దగ్గరకు వెళ్లి ఏం మాట్లాడేవారంటే.? అసలు విషయాన్ని చెప్పిన జయసుధ

బోటీలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది చర్మం కాంతివంతంగా ఉండడానికి, జుట్టు దృఢంగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ ఈ చర్మ కణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బోటీని తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అనారోగ్యాలను నివారిస్తుంది. ఇంతేకాక, శారీరక బలానికి కావలసిన ప్రొటీన్లు, బి విటమిన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

అయితే, బోటీ తినడం వల్ల లాభాలు ఉన్నప్పటికీ, దాన్ని శుభ్రం చేసే పద్ధతి చాలా ముఖ్యం. మేక పేగుల్లో మలినాలు ఉండే అవకాశం ఉన్నందున, వాటిని వేడి నీటితో కనీసం నాలుగైదు సార్లు క్షుణ్ణంగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే బాగా ఉడికించి తీసుకోవాలి. సరిగ్గా ఉడకని బోటీ వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వైద్య నిపుణులు మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతుందని లేదా రుచిగా ఉందని అతిగా తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. మటన్ లేదా బోటీ ఏదైనా సరే, పరిమితంగా, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడే శరీరానికి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. సరైన పరిశుభ్రత, మితమైన వినియోగం బోటీ ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి కీలకం.

ఇది చదవండి: ‘తాగేసి షూటింగ్‌కి వచ్చానని.. ఎన్టీఆర్ మా ఫైటర్స్‌ను పిలిచి ఏం చేశాడంటే..’

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.