Guava: వీరు జామపండు అస్సలు తినకూడదు..! తిన్నారో ఇక ఆస్పత్రి బెడ్డుకే..
జామపండు విటమిన్ సి, ఫైబర్, పొటాషియం కలిగి రోగనిరోధక శక్తిని, జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే కడుపు ఉబ్బరం, డయాబెటిస్, మూత్రపిండాల సమస్యలు, దంత సమస్యలు, అలర్జీలు, జలుబు ఉన్నవారు దీనిని తినే విషయంలో జాగ్రత్త వహించాలి లేదా నివారించాలి. అధిక మోతాదులో తీసుకోవడం కొన్ని ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేయవచ్చు.

జామపండులో విటమిన్ సి, డైటరీ ఫైబర్, పొటాషియం తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనివలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. జామపండులో నారింజ పండు కంటే అధికంగా విటమిన్ సి ఉంటుంది. దీనివలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది మరియు రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది. జామపండులో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. జామపండులో అనేక పోషకాలు ఉన్నప్పటికీ, కొందరు దీనిని తినకపోవడం లేదా పరిమితంగా తీసుకోవడం మంచిది. దీనివల్ల వారిలో పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇది చదవండి: హీరోయిన్లు అందరూ శోభన్ బాబు దగ్గరకు వెళ్లి ఏం మాట్లాడేవారంటే.? అసలు విషయాన్ని చెప్పిన జయసుధ
కడుపు ఉబ్బరంతో బాధపడేవారు జామకాయలు తినకపోవడం శ్రేయస్కరం. ఇందులో ఫ్రక్టోస్, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల కడుపు ఉబ్బరం పెరిగే అవకాశం ఉంది. అలాగే, ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) సమస్యతో బాధపడేవారు జామకాయలు తినకపోవడం మంచిది. గ్లైసెమిక్ ఇండెక్స్ గ్లూకోజ్ స్థాయిలో తక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ రోగులు జామపండును తినవచ్చని చెబుతుంటారు. అయితే, డయాబెటిస్‌తో బాధపడేవారు ఎక్కువ మోతాదులో జామకాయలు తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అతిగా తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు.
జామ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు శరీరం నుండి అదనపు పొటాషియంను సులభంగా తొలగిస్తాయి. కానీ మూత్రపిండాల పనితీరు బలహీనంగా ఉన్నవారికి లేదా మూత్రపిండాల డయాలసిస్ లో ఉన్నవారికి అదనపు పొటాషియం హానికరం కావచ్చు. అలాంటి సందర్భాల్లో జామ పండ్లను పరిమిత పరిమాణంలో తినడం లేదా వాటిని పూర్తిగా నివారించడం మంచిది. అలాగే, జామకాయ గట్టిగా ఉంటుంది కాబట్టి పచ్చి జామకాయను నమలడం వల్ల దంతాలపై ఒత్తిడి పెరుగుతుంది. బలహీనమైన దంతాలు, దంత సమస్యలు లేదా చిగుళ్ళ సమస్యలు ఉన్నవారు జామకాయను నమిలేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జామకాయ గింజలు దంతాల్లో కూడా పేరుకుపోయి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
కొంతమందికి జామపండు అలర్జీ ఉండొచ్చు. దురద, దద్దుర్లు, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జామ తినడం మానేసి వైద్యుడ్ని సంప్రదించండి. జామపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. కాబట్టి మీకు జలుబు లేదా గొంతు నొప్పి ఉంటే జామ తినడం మానుకోవాలి. ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.
ఇది చదవండి: ‘తాగేసి షూటింగ్‌కి వచ్చానని.. ఎన్టీఆర్ మా ఫైటర్స్‌ను పిలిచి ఏం చేశాడంటే..’
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




