AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Food Risks: ఉడికిస్తేనే ఆరోగ్యం.. పచ్చిగా తింటే విషం! ఆ 7 రకాల ఆహార పదార్థాలతో జాగ్రత్త

ప్రకృతి సిద్ధంగా దొరికేవి పచ్చిగా తింటేనే బలం అని చాలా మంది నమ్ముతుంటారు. కానీ, అన్ని పదార్థాల విషయంలో ఇది నిజం కాదు! కొన్ని రకాల ఆహార పదార్థాలు పచ్చిగా ఉన్నప్పుడు వాటిలో హానికరమైన బ్యాక్టీరియా, విషపూరిత రసాయనాలు (Toxins) ఉంటాయి. వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, జీర్ణక్రియ సమస్యలు, చివరకు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. వండటం లేదా ఉడికించడం వల్ల ఆ హానికర కారకాలు నశించి, ఆహారం సురక్షితంగా మారుతుంది.

Raw Food Risks: ఉడికిస్తేనే ఆరోగ్యం.. పచ్చిగా తింటే విషం! ఆ 7 రకాల ఆహార పదార్థాలతో జాగ్రత్త
Raw Food Risks
Bhavani
|

Updated on: Jan 28, 2026 | 7:12 PM

Share

ఇండోర్‌కు చెందిన సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సఫ్దర్ హుస్సేన్ అలీ డైటీషియన్ నిధి శుక్లా పాండే హెచ్చరికల ప్రకారం.. ముఖ్యంగా వర్షాకాలం వేసవిలో పచ్చి ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పచ్చి గుడ్లలోని ‘అవిడిన్’ విటమిన్ లోపానికి కారణమైతే, పచ్చి పాలలోని ‘లిస్టెరియా’ వంటి బ్యాక్టీరియా ప్రాణాంతకం కావచ్చు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ఏయే పదార్థాలను ఖచ్చితంగా ఉడికించి తినాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పచ్చిగా అస్సలు తినకూడని 7 పదార్థాలు:

పచ్చి గుడ్లు: పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా అనే ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. గుడ్డు తెల్లసొన, పచ్చసొన గట్టిపడే వరకు ఉడికించి తినడమే సురక్షితం.

పచ్చి పాలు: పాశ్చరైజ్ చేయని పాలలో ఇ. కోలి, లిస్టీరియా వంటి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి గర్భిణీలు, పిల్లలకు ఎంతో ప్రమాదకరం. పాలను బాగా మరిగించి తాగడం వల్ల ఈ వైరస్‌లు నశిస్తాయి.

పుట్టగొడుగులు: కొన్ని రకాల పుట్టగొడుగుల్లో ప్రాణాంతకమైన టాక్సిన్లు ఉంటాయి. ఇవి కాలేయం మరియు ఇతర అవయవాలను దెబ్బతీస్తాయి. ఉడికించడం వల్ల వీటిలోని హానికర రసాయనాలు నశించి, జీర్ణక్రియ సులభమవుతుంది.

క్యాబేజీ: క్యాబేజీ ఆకుల్లో పురుగులు లేదా క్రిములు ఉండే అవకాశం ఉంది. అందుకే దీనిని నేరుగా సలాడ్లలో వాడే కంటే, వేడి నీటిలో కొద్దిగా ఉడికించి వాడటం మంచిది.

ఫ్రెంచ్ బీన్స్ : పచ్చి బీన్స్‌లో హానికరమైన అమైనో యాసిడ్లు ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి, బాగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి. లేదంటే ఇవి విషతుల్యంగా మారతాయి.

పాలకూర : పాలకూరలో ఇ. కోలి బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. దీనిని ఉడికించడం వల్ల బ్యాక్టీరియా నశించడమే కాకుండా, శరీరానికి పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది.

మొలకలు : మొలకలు ఆరోగ్యకరమే అయినా, వాటిని పెంచే తేమతో కూడిన వాతావరణం బ్యాక్టీరియా పెరగడానికి కూడా కారణమవుతుంది. బయట కొన్న మొలకలను పచ్చిగా తినకుండా, లైట్‌గా ఫ్రై చేయడం లేదా ఉడికించడం శ్రేయస్కరం.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసే ముందు వైద్యులను సంప్రదించండి.

Follow Us
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.2 రేటింగ్
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.2 రేటింగ్
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?