Bulls and red color myth: ఎద్దులకు ఎరుపు రంగును చూస్తే కోపం వస్తుందా..? షాకింగ్ ఫ్యాక్ట్ ఇదే..!
Bull Vision: చాలా సినిమాల్లో ఎద్దులకు ఎరుపు రంగు పడదు అని.. ఆ రంగు వస్త్రాలు ధరిస్తే దాడులు చేస్తాయని చూశాం. దీంతో మనకు చాలా సందేహాలు వచ్చే ఉంటాయి. ఎద్దులు, ఆవులు లాంటి సాదు జంతువులకు ఎరుపు రంగు పడదా? ఆ రంగు దుస్తులను చూస్తే ఎద్దులకు కోపం వస్తుందా? అనే సందేహాలు ఏర్పడతాయి. వాటికి సంబంధించిన నిజా నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం.. ఎరుపు రంగు దుస్తులు చూసిన ఎద్దులు ఆ వ్యక్తులపైకి దూసుకొచ్చి దాడి చేస్తుంటాయి. ఎక్కువగా హీరోయిన్లపై ఎరుపు రంగు దుస్తులు పడితే వారి వెంట ఎద్దులు పరుగెత్తి దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. అది సినిమా కాబట్టి హీరో వెళ్లి కాపాడతాడు. ఎరుపు రంగు దుస్తులను తీసి వేసివేయడంతో ఆ జంతువులు దాడి చేయకుండా వెళ్లిపోతాయి. ఈ దృశ్యాలను చూసిన ప్రతీసారీ ఎద్దులు, ఆవులు, గేదెలు లాంటి సాదు జంతువులకు ఎరుపు రంగు పడదా? ఆ రంగు దుస్తులను చూస్తే ఎద్దులకు కోపం వస్తుందా? అనే సందేహాలు ఏర్పడతాయి. వాటికి సంబంధించిన నిజా నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎరుపు రంగు అంటే పడదా..?
స్పెయిన్‌లో ఎద్దుల పోరాటం(బుల్ ఫైటింగ్) చాలా ఫేమస్. అక్కడ భారీ స్టేడియంలో వేలాది మంది ప్రేక్షుకులు చూస్తుండగా.. మైదానంలో ఎద్దును వదులుతారు. ఓ వ్యక్తి ఎర్రటి వస్త్రంతో ఆ ఎద్దుతో పోరాటం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ ఎర్రటి వస్త్రాన్ని చూసి ఎద్దు కోపంతో దాడి చేస్తుందని అంతా అనుకుంటారు. కానీ, ఇందులో వాస్తవం మరోటి ఉంది. ఎద్దులు లేదా ఆవులు ఎరుపు రంగును ఇష్టపడవు అని పూర్తి అపోహ మాత్రమే. ఆవులు రంగులను గుర్తించలేవని నిపుణులు చెబుతున్నారు. అంటే అవి ప్రతీదాన్ని తెలుగు లేదా నలుగు/బూడిద రంగులో చూస్తాయని అంటున్నారు.
ఎరుపు రంగుతో కోపం వస్తుందా?
ఎద్దు సహజంగానే దూకుడుగా ఉండే జంతువు. మనం స్పెయిన్‌లో చూసే ఆట సమయంలో ఎద్దు ఎర్రటి వస్త్రంతో కోపానికి గురికాదు. కానీ, ఆ వస్త్రాన్ని దాని ముఖంపై పదే పదే కొట్టినట్లు చేయడంతో దానికి బాగా చిరాకు వస్తుంది. దీంతో ఆ వస్త్రంపై దాడి చేస్తుంది. ఇలా వస్త్రాన్ని దానిపై ఊపడం ద్వారా ఎద్దును పోరాటానికి సిద్ధం చేస్తారన్నమాట. అంటే ముఖంపై పదే పదే వస్త్రాన్ని తాకించడంతోనే చిరాకుతోనే ఆ ఎద్దులు వారిపై దాడి చేస్తాయని తెలుస్తోంది.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?
ఎద్దులు, ఆవులపై 2007లో మిత్ బస్టర్స్ అనే వెబ్‌సైట్ ఓ అధ్యయనం చేసింది. మూడు విధాలుగా నిర్వహించిన ఈ అధ్యయనంలో ఎరుపు, నీలం, తెలుపు వస్త్రాలను ఉపయోగించారు. అయితే, ఏ రంగు వస్త్రాలను ఉపయోగించినా.. వాటికి చిరాకు తెప్పించే ప్రయత్నం చేస్తే తప్ప ఆ జంతువులు దాడి చేసే ప్రయత్నం చేయలేదు. అంటే రంగులను బట్టి ఎద్దులు దాడి చేస్తాయనేది వాస్తవం కాదని ఆ అధ్యయనం తేల్చింది. అందుకే ఎర్రటి వస్త్రాలు ఎద్దులు లేదా ఆవులకు కోపం తెప్పిస్తాయనే వాదనలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇక ఎర్రటి వస్త్రాలు ధరించి కూడా నిర్భయంగా ఆ జంతువుల ముందు తిరగవచ్చు.
