AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dancer Anil Raju: 16 ఏళ్లకే ఆ కోరికలు.. అమ్మాయిలా మారానని కుక్కని కొట్టినట్టు కొట్టారు.!

డ్యాన్స్ మాస్టర్ అనిల్ రాజు తన ట్రాన్స్‌జెండర్ జీవితంలోని కష్టాలను, కుటుంబం తనను ఎలా దూరం పెట్టిందనే విషయాలను పంచుకున్నారు. ముంబైలో ట్రాన్స్‌జెండర్లతో భిక్షాటన, కుటుంబ సభ్యుల దాడి లాంటివి వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Dancer Anil Raju: 16 ఏళ్లకే ఆ కోరికలు.. అమ్మాయిలా మారానని కుక్కని కొట్టినట్టు కొట్టారు.!
Dancer Anil Raju
Ravi Kiran
|

Updated on: Jan 30, 2026 | 12:26 PM

Share

డ్యాన్స్ మాస్టర్ అనిల్ రాజు తన బాల్యం, ట్రాన్స్‌జెండర్‌గా ఎదుర్కొన్న సవాళ్లను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తొమ్మిది మంది పిల్లలలో(ఆరుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు) చివరివాడైన అనిల్ రాజు.. పదహారేళ్ల వయసులోనే తన హావభావాలు, నడక, మాట తీరు కారణంగా ఇంటి నుంచి ముంబైకి వెళ్లిపోయారు. అక్కడ ఒక నెల పాటు ట్రాన్స్‌జెండర్‌లతో కలిసి భిక్షాటన చేశారు. అతని తల్లి స్వర్ణలత, పన్నమ్మ అనే గురువు సాయంతో అతన్ని ఇంటికి తిరిగి తీసుకువచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత అనిల్ రాజు.. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కున్నారు. ముఖ్యంగా రాయలసీమలో ట్రాన్స్‌జెండర్‌‌ల పట్ల వ్యతిరేకత ఉండటంతో.. ‘కుక్కను కొట్టినట్టు కొట్టేవారు’ అని అనిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, చీర కట్టుకోవాలనే తన ఆశను వదులుకోలేదన్నారు. అతని తల్లి స్వర్ణలత మాత్రమే అతనికి మద్దతునిచ్చి, ‘ఏ చీర అయినా కట్టుకో నాయనా, ఎలాగైనా ఉండు’ అని ప్రోత్సహించారు. ఆ తర్వాత అనిల్ రాజు క్రిస్టియన్ మతంలోకి మారారు.

ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

అనిల్ రాజు తల్లి స్వర్ణలత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినవారు. ఆమెకు 200 ఎకరాల పొలం, లారీలు, రైస్ మిల్లులు ఉండేవి. ఆమె తాత బోగం సుబ్బన్న ప్రొద్దుటూరులో మొదట యాపకాయల వ్యాపారం చేసి, ఆ తర్వాత హోటల్ వ్యాపారం కూడా నిర్వహించారు. స్వర్ణలత గాయనిగా గొప్ప పేరు సంపాదించారు. 1946లోనే పాటకి రూ. 500, నెల జీతం రూ. 50 తీసుకునేవారని, అప్పట్లో ఆమెకు మూడు అంబాసిడర్ కార్లు ఉండేవని అనిల్ రాజు తెలిపారు. స్వర్ణలత ప్రతిరోజు వేర్వేరు ఆభరణాలు ధరించేవారని.. పాటల రికార్డింగ్‌లకు కూడా బంగారు నగలతోనే వెళ్ళేవారని ఆయన అన్నారు. తన తల్లి ఉన్నప్పుడు తనకు కష్టమంటే తెలియదని.. ప్రస్తుతం తాను ఒక పాటకు రూ. 2-3 లక్షలు తీసుకుంటున్నప్పటికీ, తల్లి లేని లోటు తీర్చలేనిదని అనిల్ రాజు భావోద్వేగమయ్యారు. చాకలమర్రి అబ్బాయిని ప్రేమించి, కోటి రూపాయలు పోగొట్టుకున్న సంఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు ఆస్తులు ఉన్నప్పటికీ, తల్లి లేని లోటు, ఆమె పడిన కష్టాలు, పేదరికం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతోందని అనిల్ రాజు వివరించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..