AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Movie: ‘దసరా’ సినిమాకు సిల్క్ స్మిత పోస్టర్‏కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?..

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో దసరా చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నాని. పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నారు. ఇందులో న్యాచురల్ స్టార్ నాని పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. వీర్లపాలెం అనే గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

Dasara Movie: 'దసరా' సినిమాకు సిల్క్ స్మిత పోస్టర్‏కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?..
Dasara Movie
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2023 | 12:26 PM

Share

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదేల తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం దసరా. సింగరేణి నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇందులో నాని జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో దసరా చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నాని. పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నారు. ఇందులో న్యాచురల్ స్టార్ నాని పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. వీర్లపాలెం అనే గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అంచనాలను పెంచేశాయి. ఇందులో నాని ధరణి పాత్రలో కనిపించనుండగా.. వెన్నెల పాత్రలో కీర్తి కనిపించనుంది.అయితే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ లో అలనాటి అందాల తార సిల్క్ స్మిత పోస్టర్.. ఆ పోస్టర్ దగ్గరే ఉన్న అరుగుపై పవ్వ సీసా పట్టుకుని నాని కూర్చున్నట్లు కనిపిస్తుంటాడు. అంతేకాకుండా.. ఓ పాటలోనూ సిల్క్ స్మిత పోస్టర్స్ కనిపిస్తుంటాయి. దీంతో ఈ కథకు.. సిల్క్ స్మితకు సంబంధం ఏంటీ అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఇందులో నాని సిల్క్ స్మిత అభిమానిగా కనిపించనున్నాడని టాక్ నడిచింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. సిల్క్ స్మిత పోస్టర్ కనిపించడానికి గల కారణాన్ని తెలిపారు. అంతా అనుకున్నట్లు తాను ఈ సినిమాలో సిల్క్ స్మిత ఫ్యాన్ కాదని.. ఆమెకు తన డైరక్టర్ శ్రీకాంత్ వీరాభిమాని అన్నారు. అయితే సినిమాలో ఆమె పోస్టర్ పెట్టడానికి కారణాన్ని మాత్రం నాని సస్పెన్స్ లో పెడుతున్నాడని అన్నారు నాని. ఈ సందేహాలకు మార్చి 30తో క్లారిటీ రానున్నట్లు తెలిపారు.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..