Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘గంగోత్రి’ సింహాద్రి నుంచి పుష్పరాజ్ వరకు.. అల్లు అర్జున్ 20 ఏళ్ల సినీ ప్రస్థానం.. బన్నీ ట్వీట్ వైరల్..

ఈరోజుతో నటుడిగా నేను చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. మీ ప్రేమ.. ఆశీర్వాదాలు ఎప్పుడూ నా వెంటే ఉన్నాయి. ఇండస్ట్రీలో నన్ను అభిమానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రేక్షకుల ప్రేమకు రుణపడి ఉంటాను. ఎప్పటికీ నేను మీకు కృతజ్ఞుడినే

Allu Arjun: 'గంగోత్రి' సింహాద్రి నుంచి పుష్పరాజ్ వరకు.. అల్లు అర్జున్ 20 ఏళ్ల సినీ ప్రస్థానం.. బన్నీ ట్వీట్ వైరల్..
20 Years For Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2023 | 12:08 PM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న అగ్రకథానాయకులలో అల్లు అర్జున్ ఒకరు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. సినీరంగంలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు హృదయపూర్వక నోట్ షేర్ చేశారు అర్జున్. “ఈరోజుతో నటుడిగా నేను చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. మీ ప్రేమ.. ఆశీర్వాదాలు ఎప్పుడూ నా వెంటే ఉన్నాయి. ఇండస్ట్రీలో నన్ను అభిమానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రేక్షకుల ప్రేమకు రుణపడి ఉంటాను. ఎప్పటికీ నేను మీకు కృతజ్ఞుడినే ” అంటూ ట్వీట్ చేశారు బన్నీ. దీంతో అల్లు అర్జున్‏కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.

2003లో కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన గంగోత్రి సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు బన్నీ. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా నటుడిగానూ ప్రశంసలు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా.. అల్లు రామలింగయ్య మనవడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ.. నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆర్య, బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2 ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ.. పక్కా ఊర మాస్ పాత్రలో అదరగొట్టారు. దీంతో దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్ కు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సిక్వెల్ చేస్తున్నారు బన్నీ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.