AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Joshi: ఈ టాలీవుడ్ హీరో గుర్తున్నాడా.. ? అతడి భార్య తోపు హీరోయిన్.. ఎవరంటే..

తెలుగు సినిమా ప్రపంచంలో చాలా మంది ఒక్క సినిమాతో పాపులర్ అయ్యారు. ఒకటి రెండు సినిమాలతో హీరోగా సక్సెస్ అయ్యి.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమైన హీరోస్ గురించి మీకు తెలుసా.. ? అందులో సచిన్ జోషి ఒకరు. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ నటుడిగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు.

Sachin Joshi: ఈ టాలీవుడ్ హీరో గుర్తున్నాడా.. ? అతడి భార్య తోపు హీరోయిన్.. ఎవరంటే..
Sachin Joshi.jp
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2025 | 5:12 PM

Share

సచిన్ జోషి.. తెలుగులో తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన హీరో. కానీ అంతే టైంలో ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారు. ఒకటి రెండు చిత్రాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. సినిమా ప్రపంచంలో రాణించాలంటే ప్రతిభతోపాటు అవగింజంత అదృష్టం కూడా ఉండాలి. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేశాడు. కానీ అతడు చేసిన ఒక్క సినిమా కూడా హిట్టు కాలేదు. తెలుగు సుపరిచితమైన సచిన్ జోషి.. ఒకప్పుడు తనదైన నటనతో అలరించారు. 2002లో మౌనమేలనోయి సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత నిన్ను చూడకుండా నేనుండలేను, ఓరెయ్ పండు వంటి చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమాలు సైతం అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకు దూరంగా ఉండిపోయారు. తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో నటించారు. దాదాపు 9 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఆషికీ 2 తెలుగు రీమేక్ నీ జతగా నేనుండాలి మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా సైతం డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టుగానూ రెండు మూడు సినిమలు చేశాడు. అయినా సక్సెస్ కలిసిరాలేదు. దీంతో పూర్తిగా ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‏కు ప్రపంచమే జై కొట్టింది..

ఇదిలా ఉంటే.. సచిన్ జోషి భార్య సైతం హిందీ, తెలుగులో తోపు హీరోయిన్ అన్న సంగతి మీకు తెలుసా.. ? నిజానికి సచిన్ జోషి సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్. వేల కోట్లకు అధిపతి. కానీ నటుడిగా సక్సెస్ కాలేకపోయారు. ఇక సచిన్ జోషి భార్య పేరు ఊర్వశీ శర్మ. 2008లో త్రీ సినిమాతో కథానాయికగా మెప్పించింది. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో తెలుగులో మరో సినిమా చేయలేదు. హిందీలో పలు సినిమాల్లో నటించింది. సచిన్ జోషి, ఊర్వశి దంపతులకు బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపారరంగంలో రాణిస్తున్నారు.

Urvashi Sharma

Urvashi Sharma

ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..