AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోలకు లవర్‌గా.. మెగాస్టార్‌కు మాత్రం అక్కగా.. ఈ అందాల భామ ఎవరో తెలుసా.?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో బాస్ అంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

స్టార్ హీరోలకు లవర్‌గా.. మెగాస్టార్‌కు మాత్రం అక్కగా.. ఈ అందాల భామ ఎవరో తెలుసా.?
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Sep 08, 2025 | 2:40 PM

Share

మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే రెండు క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రీసెంట్ డేస్ లో చిరంజీవి నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో అవ్వడం లేదు. చివరిగా వచ్చిన భోళాశంకర్ సినిమా ప్రేక్షకులు దారుణంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వశిష్ఠతో సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు విశ్వంభర అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా సోషియా ఫాంటసీ కథతో తెరకెక్కుతుంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.?

స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన ఓ అందాల భామ చిరంజీవికి మాత్రం అక్కగా నటించింది. పైగా ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు అందాల భామ ఖుష్బూ.. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాదు ఖుష్బూ అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఖుష్బూ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల భామ.

ఇవి కూడా చదవండి

కాగా వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఖుష్బూ.. చిరంజీవి సినిమాలో మాత్రం అక్కగా నటించారు. ఆ సినిమానే స్టాలిన్. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చిరంజీవి, కుష్బూ అక్క తమ్ముళ్లుగా కనిపించారు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె. ఖుష్బూ‌కు తెలుగుతో పాటు తమిళనాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఖుష్బూ‌ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 54ఏళ్ల వయసులోనూ ఖుష్బూ తన అందంతో ఆకట్టుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..