Jathi Ratnalu : ఎలా మిస్సయ్యావు బ్రో.. జాతిరత్నాలు సినిమాకు ఫస్ట్ ఛాయిస్ అతడే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ కామెడీ చిత్రాల్లో జాతిరత్నాలు ఒకటి. నవీన్ పొలిశెట్టి హీరోగా డైరెక్టర్ అనుదీప్ కేవి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు నవీన్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అంతకు ముందు మరో యంగ్ హీరోను అనుకున్నారట. ఇంతకీ అతడు ఎవరంటే..

సాధారణంగా సినీరంగంలో కొంతమంది దర్శకులు ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటారు. కానీ అనుహ్యంగా పలు కారణాలతో వేరే హీరోతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో స్టార్ హీరోస్ తమ వరకు వచ్చిన కథలను రిజెక్ట్ చేస్తుంటారు. ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు రిజెక్ట్ చేసిన హీరోస్ ఫీలవుతుంటారు. మరికొన్ని సార్లు స్టార్స్ ఖాతాలో పడాల్సిన ప్లాపులు మరొకరి వద్దకు చేరుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కథ నచ్చినప్పటికీ.. మరో సినిమాతో బిజీగా ఉండడం, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కొన్ని ప్రాజెక్ట్స్ వదిలేసుకున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. అందులోనూ జాతిరత్నాలు సినిమాను మిస్సైన హీరో ఎవరో తెలుసా.. ? అయితే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?
డైరెక్టర్ అనుదీప్ కేవి దర్శకత్వం వహించిన ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ జాతిరత్నాలు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఫరియా అబ్దుల్లా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. తక్కువ సమయంలోనే పాజిటివ్ మౌత్ టాక్ అందుకుని జనాలను విపరీతంగా నవ్వించిన ఈ చిత్రాన్ని ఓ స్టార్ హీరో మిస్సయ్యారు. నిజానికి నవీన్ పోలిశెట్టి కంటే ముందు ఈ సినిమా కథను డైరెక్టర్ అనుదీప్ యంగ్ హీరో తేజ సజ్జాకు చెప్పారట. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కానీ ఆ సినిమాను నవీన్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
జాతిరత్నాలు సినిమాలో తన పాత్రకు నవీన్ ప్రాణం పోశారని.. అద్భుతమైన నటనతో కట్టిపడేశారని.. అందులో నవీన్ కంటే ఎవరూ బాగా చేయలేరని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ చిత్రం ఈనెల 12న రిలీజ్ కానుంది. ప్రాచీన గ్రంథాలను కాపాడే యోధుడిగా ఇందులో తేజ సజ్జా కనిపించనున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..








