AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sathi Leelavathi: రిలీజ్‌కు రెడీ అయిన మెగాకోడలి కొత్త సినిమా.. సతీ లీలావతి వచ్చేది ఎప్పుడంటే

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Sathi Leelavathi: రిలీజ్‌కు రెడీ అయిన మెగాకోడలి కొత్త సినిమా.. సతీ లీలావతి వచ్చేది ఎప్పుడంటే
Sathi Leelavathi
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2026 | 1:44 PM

Share

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల పెళ్లి తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించారు. అడపదడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఆ మధ్య ఓ సిరీస్ లో నటించిన లావణ్య.. ఇప్పుడు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య , దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్‌.

ఇది కూడా చదవండి: డార్లింగ్ సాంగ్‌ను రీ క్రియేట్ చేశారు.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!

రెండు వేర్వేరు కుటుంబాలు, నేప‌థ్యాల నుంచి వచ్చిన వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణించాలంటే వారి మ‌ధ్య ఎమోష‌న్స్ ఇంకెంత బ‌లంగా ఉండాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇలాంటి సునిశిత‌మైన అంశాన్ని స‌తీ లీలావ‌తి చిత్రంలో ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య‌. భార్య‌, భ‌ర్త మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గానూ చెప్పే ప్ర‌య‌త్న‌మే స‌తీలీలావ‌తి చిత్రం. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాను రూపొందించామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

ఇది కూడా చదవండి: ఎంత పని చేశావ్ సామి..!! రెమ్యునరేషన్ కారణంగా ప్రభాస్ సినిమాకు నో చెప్పిన నటుడు..

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ రిలీజ్ కానుంది. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఆమెకు రోజుకు 50సార్లు ఐ లవ్ యూ చెప్పేవాడ్ని.. ఆ హీరోయిన్ కోపంతో వెళ్ళిపోయింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us