నాని సినిమాపైనే బోలెడన్ని ఆశలు.. పాన్ ఇండియా హిట్ పై కన్నేసిన భామ

Rajeev 

25 April 2026

instagram

కాయదు లోహర్.. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ. 

తమిళ్ లో స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో అల్లూరి అనే సినిమాతో పరిచయం అయ్యింది. 

ఈ సినిమాలో హీరోగా శ్రీవిష్ణు నటించాడు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో తిరిగి తమిళ్ లోనే నటించింది. 

అయితే అక్కడ నటించిన డ్రాగన్ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాంతో మరోసారి తెలుగు లో నటించింది. 

ఈ క్రమంలోనే విశ్వక్ సేన్ తో కలిసి ఓ సినిమా చేసింది. ఫంకీ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

ఈ సినిమా తర్వాత ఇప్పుడు నాని నటిస్తున్న ప్యారడైజ్ లో సినిమాలో నటిస్తుంది కాయదు. ఇటీవలే ఈ సినిమా నుంచి కాయదు లుక్ రిలీజ్ అయ్యింది. 

ప్యారడైజ్ సినిమాపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది ఈ భామ. నాని సినిమా హిట్ అయితే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంటుంది కాయదు.