Venkatesh: వెంకీకి తల్లిగా, లవర్‌గా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు సినిమాలకు దూరంగా..
ఒకప్పుడు హీరో పక్కన హీరోయిన్ గా, ఆ తర్వాత అదే హీరోకు తల్లిగా, అత్తగా చేసిన నటీమణులు చాలా మందే ఉన్నారు. అలా విక్టరీ వెంకటేష్ తో కలిసి చాలా సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్, ఆ తర్వాతి కాలంలో ఇదే వెంకీకి తల్లిగా యాక్ట్ చేసింది.

హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. మహా అంటే ఒక పదేళ్లు, మరీ ఎక్కువంటే 15 ఏళ్లు హీరోయిన్ గా నటిస్తుంది. అంతకు మించి నటించాలంటే సీనియర్ హీరోల పక్కన కథానాయకిగా చేయాల్సిందే. ఇక హీరోయిన్ అవకాశాలు తగ్గిపోతే సహాయక నటి పాత్రలకు ఓకే చెప్పాల్సిందే. హీరోలు/ హీరోయిన్లకు వదినగా, అక్కగా, తల్లిగా, అత్తగా నటించాల్సిందే. అలా ఒకప్పుడు హీరో పక్కన హీరోయిన్ గా చేసి , ఆ తర్వాత కాలలంలో అదే హీరోకు తల్లిగా చేసిన నటీమణులు చాలామందే ఉన్నారు. ఈ నటి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. గతంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, సుమన్, రజనీకాంత్, మోహన్ లాల్, రవిచంద్రన్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. తన అందం, అభినయంతో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత సహాయక నటిగా మారిపోయిందీ అందాల తార. స్టార్ హీరోలు/ హీరోయిన్లకు అక్కగా, వదినగా, అత్తగా, అమ్మగా నటించి మెప్పించింది. ఈ క్రమంలో ఒకప్పుడు వెంకటేష్ తో కలిసి పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ అందాల తార. అయితే ఆ తర్వాత కాలంలో ఇదే వెంకీకి తల్లిగా నటించింది. ఇలా దగ్గుబాటి హీరోకు తల్లిగా, ప్రియురాలిగా నటించిన ఆ ఏకైక హీరోయిన్ మరెవరో కాదు అందాల తార భానుప్రియ.
వెంకటేష్ కలిసి ఒకప్పుడు స్వర్ణకమలం, శ్రీనివాస కళ్యాణం, వారసుడొచ్చాడు తదితర సినిమాల్లో హీరోయిన్ గా చేసింది భాను ప్రియ. ముఖ్యంగా వీరి కాంబోలో వచ్చిన స్వర్ణకమలం కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత కాలంలో వెంకటేష్ హీరోగా నటించిన జయం మనదేరా సినిమాలో అతనికి తల్లిగా నటించింది.
View this post on Instagram
కాగా భానుప్రియ 1998లో ఆదర్శ్ కౌశల్‌ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాలు చేసింది. అయితే 2018లో భానుప్రియ జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్త ఆదర్శ్ గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదం తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించిన భాను ప్రియ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను మతిపరుపుతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ‘నాకు ఇటీవల ఆరోగ్యం బాగాలేదు. జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. నేర్చుకున్న విషయాలు మర్చిపోతున్నాను. నేను చేయాల్సిన పనులు గుర్తుండడం లేదు. షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాల్సిన డైలాగ్స్ మర్చిపోతున్నాను’ అని వాపోయింది భాను ప్రియ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




