- Telugu News Photo Gallery Cinema photos Know This Actress 4 Movies Will Release In Ahead Months, Her name is Samyuktha Menon
Actress : చేసిన సినిమాలన్నీ హిట్టు.. రెండేళ్లు కనిపించకుండా పోయిన హీరోయిన్.. ఇప్పుడు ఇలా..
సౌత్ ఇండస్ట్రీలో ఆమె గోల్డెన్ హీరోయిన్. స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఈ బ్యూటీకి మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. రెండేళ్లు అడియన్స్ ముందుకు రానీ హీరోయిన్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇంతకీ ఆమె ఎవరో మీరు గుర్తుపట్టారా.. ?
Updated on: Nov 29, 2025 | 8:47 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు.

రెండేళ్లపాటు ఏ సినిమాలో నటించని ఆమె.. ఇప్పుడు మాత్రం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు.. రాబోయే నాలుగు నెలల్లో ఆమె నటిస్తోన్న నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇది ఆమె అభిమానులకు శుభవార్త అని చెప్పొచ్చింది. ఇంతకీ ఆమెను గుర్తుపట్టారా.. ?

ఆమె మరెవరో కాదండి హీరోయన్ సంయుక్త మీనన్. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించి.. ఒక్కసారిగా పాపులర్ అయ్యింది సంయుక్త.

ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు. దాదాపు రెండేళ్లు అడియన్స్ ముందుకు రాకుండా సైలెంట్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు బాలకృష్ణ నటిస్తోన్న అఖండ 2 చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఇది డిసెంబర్ 5న విడుదల కానుంది.

అలాగే నిఖిల్ జోడిగా నటిస్తున్న స్వయంభు ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. మూడవది నారి నారి నడుమ మురారి ఫిబ్రవరి మూడవ వారంలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. నాలుగవ సినిమా.. మహారాగ్ని: క్వీన్ ఆఫ్ క్వీన్స్. సంయుక్త నటించిన తొలి హిందీ చిత్రం మహారాగ్ని మార్చిలో విడుదల కానుంది.




