Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: రజినీకాంత్ చేతివేళ్లు ఇలా ఎందుకు పెడతారో తెలుసా.. ఈ ముద్ర వెనుక ఆరోగ్య రహస్యమే..

కమల్ హాస్ తో కలిసి విలన్ పాత్రలు సైతం పోషించారు. 1978లో కమల్ తోపాటు పలు చిత్రాల్లో కొనసాగించిన రజినీ.. భాస్కర్ దర్శకత్వం వహించిన భైరవి సినిమాతో సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్నారు. వాకింగ్ స్టైల్ నుంచి యాక్టింగ్ వరకు రజినీ చాలా ప్రత్యేకం. రజనీకాంత్ స్టైల్ , స్పీచ్ , చేసే ప్రతి పని చాలా ప్రత్యేకంగా ఉండడంతో ఆయన చేసే ప్రతి చర్య అభిమానులను ఆకట్టుకుంటుంది.

Rajinikanth: రజినీకాంత్ చేతివేళ్లు ఇలా ఎందుకు పెడతారో తెలుసా.. ఈ ముద్ర వెనుక ఆరోగ్య రహస్యమే..
Rajinikanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 11, 2024 | 7:38 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ బస్ కండక్టర్ నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. రజినీ యాటిట్యూడ్, స్టైల్, మేనరిజం అప్పట్లో ఓ ట్రెండ్. అపూర్వ రాగంగళ్ సినిమాతో తమిళ్ సినీరంగంలోకి అడుగుపెట్టారు. కెరీర్ మొదట్లో హీరోగా కాకుండా చిన్న చిన్న పాత్రలు పోషించారు. అలాగే కమల్ హాస్ తో కలిసి విలన్ పాత్రలు సైతం పోషించారు. 1978లో కమల్ తోపాటు పలు చిత్రాల్లో కొనసాగించిన రజినీ.. భాస్కర్ దర్శకత్వం వహించిన భైరవి సినిమాతో సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్నారు. వాకింగ్ స్టైల్ నుంచి యాక్టింగ్ వరకు రజినీ చాలా ప్రత్యేకం. రజనీకాంత్ స్టైల్ , స్పీచ్ , చేసే ప్రతి పని చాలా ప్రత్యేకంగా ఉండడంతో ఆయన చేసే ప్రతి చర్య అభిమానులను ఆకట్టుకుంటుంది.

అయితే సినిమాలు కాకుండా రజినీకి హిమాలయాలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. ప్రశాంతమైన మనసు.. వాతావరణం కోసం అనేకసార్లు హిమాలయాలకు వెళ్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా రజినీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. మాములుగా రజినీకాంత్ బొటనవేలు, చూపుడు వేలు కలిపి ముద్ర వేస్తుంటారు. నార్మల్ గా కాకుండా సినిమాల్లోని ఈ ముద్ర వేస్తూ కనిపిస్తుంటాడు. పైన ఫోటోను చూశారా. అందులో రజినీ వేసిన ఆ ముద్రకు అర్థమేంటో తెలుసా..? అలా రజినీ ఆ ముద్రను వేయడానికి కారణం ఉంది.

యోగా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రజినీ అనుసరించే ఈ చేతి ముద్రను చిన్ ముద్ర అంటారు. ఈ ముద్రను అనుసరించడం వల్ల మెదడు నరాలు మెరుగ్గా పనిచేస్తాయి. అంతేకాదు జ్ఞాపకశక్తిని పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో మానసిక ప్రశాంతత వస్తుంది. ఇది కోపం, నిద్రలేమి, తలనొప్పిని తగ్గిస్తుంది. ఈ ముద్రను ప్రతిసారి అనుసరించడం వల్ల నరాలను ప్రశాంతపరుస్తుంది. అలాగే మన దృష్టి మరల్చకుండా చేస్తుంది. అందుకే ఈ ముద్ర యోగ చేస్తున్న సమయంలో ఎక్కువగా అనుసరిస్తారు. రజినీ రోజూ చేసే ఈ చిన్న పనికి ఇంత పవర్ ఉందా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.