Arundhati: అనుష్క అరుంధతిలో ఈ డిలీటెడ్ సీన్ చూశారా? సినిమా రిలీజై 15 ఏళ్లైనా ఇంకా ట్రెండింగ్‌లోనే.. వీడియో

టాలీవుడ్ స్వీటీ అనుష్కా శెట్టి నటించిన మొట్ట మొదటి లేడీ ఓరియంటెడ్ సినిమా అరుంధతి. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా 2009 లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటివరకు కేవలం గ్లామరస్ పాత్రలు పోషిస్తూ వచ్చిన అనుష్క అరుంధతి సినిమా తో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.

Arundhati: అనుష్క అరుంధతిలో ఈ డిలీటెడ్ సీన్ చూశారా? సినిమా రిలీజై 15 ఏళ్లైనా ఇంకా ట్రెండింగ్‌లోనే.. వీడియో
Arundhati
Follow us

|

Updated on: Jun 11, 2024 | 7:35 PM

టాలీవుడ్ స్వీటీ అనుష్కా శెట్టి నటించిన మొట్ట మొదటి లేడీ ఓరియంటెడ్ సినిమా అరుంధతి. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా 2009 లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటివరకు కేవలం గ్లామరస్ పాత్రలు పోషిస్తూ వచ్చిన అనుష్క అరుంధతి సినిమా తో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.  ఇందులో అనుష్కా శెట్టి డ్యూయల్ రోల్ పోషించగా, సోనూసూద్ క్రూరమైన పశుపతి పాత్రలో జనాలను భయ పెట్టాడు. షాయాజీ షిండే, సత్యనారాయణ, మనోరమ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక జేజమ్మ పాత్రలో అనుష్క నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన అరుంధతి సినిమా..థియేటర్ల దగ్గర కాసుల వర్షం కుమ్మరించింది. కేవలం రూ. 13 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. 70 కోట్లు వసూలు చేసినట్లు టాక్. ఇప్పుడు కూడా టీవీలో అరుంధతి సినిమా వస్తే మిస్ అవ్వని వారు చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సంబంధించిన ఒక డిలీటెడ్ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సినిమా రిలీజై సుమారు 15 ఏళ్లు గడిచినా ఆ సీన్ ఇంకా నెట్టింట ట్రెండ్ అవుతోంది. దీనిని చూసిన వారందరూ సినిమాలో ఈ సీన్ ఉండి ఉంటే అరుంధతి వేరే లెవెల్ లో ఉండేదంటున్నారు.

ఇంతకీ ఈ సీన్ లో ఏముందంటే.. వంటగదిలో ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటుంది అనుష్క. అక్కడ ఓ పెద్ద మంటపై ఓ బాణీలో నూనె కాగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడకు ఓ చిన్నారి వచ్చి.. పొయ్యి పక్కనే ఉన్న చెక్కపై పెట్టిన పిండి పదార్థాలను తీసుకునేందుకు పైకి ఎక్కుతుంది. అంతలో కాలు జారి నూనెలో పడబోతుంటే.. వెనుక నుంచి అనుష్క కత్తి విసురుతుంది. అది పాప చొక్కాకు తగిలి.. వేలాడేలా చేస్తుంది. దీంతో పాప నూనెలో పడకుండా కాపాడుతుంది. దీనిని చూసిన మనోరమ.. గతంలో సోనూసూద్ ను చంపేందుకు అతడు మంత్రాలు చదవకుండా ఉండేందుకు.. నోటిలో కత్తి దింపే సీన్ ను గుర్తుకు తెచ్చుకుంటుంది. ఇప్పుడిదే సీన్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

అరుంధతి డిలీటెడ్ సీన్.. వీడియో ఇదిగో..

ప్రస్తుతం అనుష్క క్రిష్ దర్శకత్వంలో ఓ లేడి ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్