జూన్ 20 రాశిఫలాలు: వారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి ఇలా..
Horoscope Today (June 20, 2026) ప్రకారం మేషం, వృషభం, మిథునం సహా 12 రాశుల వారికి శనివారంనాటి గ్రహస్థితుల ప్రభావం మిశ్రమంగా కనిపిస్తోంది. కొన్ని రాశులకు ఆర్థిక లాభాలు, ఆరోగ్య పరంగా అనుకూలత, సమస్యల పరిష్కారం వంటి శుభ ఫలితాలు ఉండగా, మరికొన్ని రాశులకు సాధారణ ఫలితాలు ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

దిన ఫలాలు (జూన్ 20, 2026): మేష రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా రోజంతా బాగా సంతృప్తికరంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, ఒత్తిడి తగ్గుతుంది. మిథున రాశి వారికి అనేక విషయాల్లో అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థికాభివృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురు, బుధ, శుక్ర గ్రహాల అనుకూలత బాగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా రోజంతా బాగా సంతృప్తికరంగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులకు చేరువవుతారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఇతరుల వివాదాల్లో కల్పించుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామికి మంచి అదృష్టం పడుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు, ధనాధిపతి బుధుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, ఒత్తిడి తగ్గుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉన్నందువల్ల అనేక విషయాల్లో అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థికాభివృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. బంధువుల ద్వారా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ కృషికి, మీ ప్రతిభకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
గురు, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పట్టుదలగా ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. ఉద్యోగంలో ఆశించిన శుభవార్త వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి లాభ స్థానంలోకి ప్రవేశించడం వల్ల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆస్తి వివాదం సానుకూలపడుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
గురు, బుధ, శుక్రుల అనుకూలత వల్ల ఆదాయం పెరగడం, రుణ భారం తగ్గడం, మంచి పరిచ యాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి కానీ, వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రవి, కుజ, శనులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా బాగా బలం పుంజుకుంటారు. ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆదాయం ఆశించినంతగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం వృద్ధి చెందుతాయి. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రవి, కుజ, గురు గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ప్రధానమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రవి, బుధుల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధ్యమవుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల వల్ల ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకుంటారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
శని, గురు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆశించిన ప్రతిఫలం ఉన్నప్పటికీ, వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తాయి. స్వలాభానికి ఉపయోగించుకునే వారి వల్ల నష్టపోతారు. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా బాగా కలసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరు గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.



