AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: కీలక గ్రహాల కటాక్షం. ఆ రాశుల వారికి సొంతిల్లు, వాహనం ఖాయం..!

Telugu Astrology: గురుడు కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితిలో ఉండడం, శుక్రుడు, బుధుడు అనుకూల స్థానాల్లో సంచారం చేయడం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి అక్టోబర్ 31లోగా గృహ, వాహన యోగాలు కలిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ కాలంలో ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం, వివాదాల నుంచి ఉపశమనం లభించడం వంటి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

Astrology: కీలక గ్రహాల కటాక్షం. ఆ రాశుల వారికి సొంతిల్లు, వాహనం ఖాయం..!
House And Vehicle Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 18, 2026 | 6:57 PM

Share

గృహ, వాహన కారకుడైన గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, శుక్ర, బుధులు కూడా అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి అక్టోబర్ 31 లోగా తప్పకుండా గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. వీరికి అక్టోబర్ చివరి వరకు బుధుడి అనుకూలత వల్ల ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి కలగడం జరగబోతోంది. కొన్ని వివాదాలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. తరచూ శివార్చన చేయించడం, విష్ణు సహస్ర నామం పఠించడం వల్ల ఈ రాశుల వారు మరింత వేగంగా, మరింత ఎక్కువగా శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది.

  1. మేషం: ఈ రాశివారికి గురువుతో పాటు బుధ, రాహు, శుక్రులు కూడా ఆర్థికంగా బలాన్ని పెంచడం జరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. కొద్ది ప్రయత్నంతో వీరికి గృహ యోగం పడుతుంది. ఆశించిన స్థాయిలో గృహ రుణం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎలాంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. జూలైలో వాహన యోగం కూడా పడుతుంది.
  2. మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తుండడం, కుజ, రవులు జూలై ద్వితీయార్థం నుంచి అనుకూలంగా మారడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది. శుక్రుడు, రాశ్యధిపతి బుధుడు కూడా అనుకూలంగా మారుతున్నందు వల్ల వీరికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరో రెండు నెలల్లో వీరికి ఆర్థిక సమస్య లన్నిటి నుంచి విముక్తి లభించి గృహ, వాహనాల మీద దృష్టి కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది.
  3. కర్కాటకం: ఈ రాశిలో భాగ్యాధిపతి, గృహ, వాహన కారకుడు అయిన గురువు సంచారం ప్రారంభించినందు వల్ల ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం జరగకపోవచ్చు. ఆర్థికంగా ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. ఫలితంగా వీరి దృష్టి సొంత ఇల్లు, వాహనాల మీద పడే అవకాశం ఉంది. వీరు ఈ దిశగా ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ధన స్థానం శుభ గ్రహాలతో బలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో జీతాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడం జరుగుతుంది.
  4. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు రాశ్యధిపతి బుధుడు దశమ, లాభ స్థానాల్లో బలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వడ్డీ వ్యాపా రాలు, లాటరీలు, షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఫలితంగా అతి తేలికగా సొంత ఇంటి కల నెరవేరడంతో పాటు వాహన యోగం కూడా కలుగుతుంది. ఆస్తులు బాగా కలిసి వస్తాయి. రుణ సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. తుల: ఈ రాశికి దశమ స్థానంలో గురువు సంచారం జరుగుతున్నంత కాలం వృత్తి, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, అదనపు ఆదాయానికి ఢోకా ఉండదు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కూడా ఉండే అవకాశం లేదు. అందువల్ల వీరు సొంత ఇంటిని అమర్చుకోవడానికి, ఆస్తులు సమకూర్చుకోవడానికి బాగా అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణానికి ఇబ్బందేమీ ఉండదు.
  7. మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గృహ కారకుడు గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు కుజుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటిని పొంద గలుగుతారు. తప్పకుండా వాహన యోగం కలుగుతుంది. ఆదాయం క్రమంగా పెరగడం తప్ప తగ్గడం ఉండదు. ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆశించిన లాభాలు పొందుతారు. తల్లితండ్రుల నుంచి ఆస్తి లభిస్తుంది.

Also Read: అరుదైన పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి లక్ష్మీకటాక్షం

Follow Us