AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: అలాంటి వ్యక్తిని కనుగొనడం చాలా అరుదు.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..

అప్పుడప్పుడు మూవీ ఈవెంట్స్, చిన్న చిన్న కార్యక్రమాల్లో మినహా.. మరెక్కడా కనిపించడం లేదు. సిటాడెల్ ప్రమోషన్స్ అనంతరం.. ఇటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది. తాజాగా సామ్ మళ్లీ ఆధ్యా్త్మిక సేవను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సద్గురుకు సంబంధించిన ఇషా ఫౌండేషన్లో కనిపించింది.

Samantha: అలాంటి వ్యక్తిని కనుగొనడం చాలా అరుదు.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 11, 2024 | 8:19 PM

స్టార్ హీరోయిన్ సమంత చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ సమస్యతో పోరాడుతున్న సామ్.. తిరిగి కోలుకోవడానికి ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. చివరిసారిగా విజయ్ దేవరకొండ జోడిగా ఖుషి చిత్రంలో కనిపించిన సామ్.. ఆ తర్వాత ఆరోగ్యం దృష్ట్యా విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడప్పుడు మూవీ ఈవెంట్స్, చిన్న చిన్న కార్యక్రమాల్లో మినహా.. మరెక్కడా కనిపించడం లేదు. సిటాడెల్ ప్రమోషన్స్ అనంతరం.. ఇటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది. తాజాగా సామ్ మళ్లీ ఆధ్యా్త్మిక సేవను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సద్గురుకు సంబంధించిన ఇషా ఫౌండేషన్లో కనిపించింది.

తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఉన్న ఇషా ఫౌండేషన్ లో నిర్వహించిన రిలాక్సింగ్ సెషన్ లో పాల్గొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఇషా ఫౌండేషన్ ఫోటోస్ షేర్ చేసింది. “మనలో చాలా మంది గురువు కోసం వెతుకుతారు. కానీ మీ జీవితంపై అవగాహనతో వెలుగులు నింపి సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని మీరు కనుగొనడం చాలా అరుదు. మీకు జ్ఞానం కావాలంటే ఈ ప్రపంచాన్ని శోధించండి. ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజు చాలా సంఘటనలు ప్రభావం చూపుతుంటాయి. మన ఆలోచన సాధారణమో.. అసాధారణమో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక్కడ కేవలం పనిచేస్తానంటే సరిపోదు. మీకున్న తెలివిని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇదిలా ఉంటే ఇటీవలే సామ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. త్రలాల అనే పేరుతో నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసిన సామ్.. ఇప్పుడు సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమా నిర్మిస్తుంది. ఇటీవల సామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్ లో పెట్టుకోండి.
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్ లో పెట్టుకోండి.
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ కండక్టర్.. అసలేం జరిగిందంటే..
మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ కండక్టర్.. అసలేం జరిగిందంటే..
సింగర్‌ నేహా సింగ్‌ రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకు ఆమె ఎవరు?
సింగర్‌ నేహా సింగ్‌ రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకు ఆమె ఎవరు?
మెడపై నలుపును చిటికెలో వదిలించే చిట్కాలివిగో.. ట్రై చేసి చూడండి..
మెడపై నలుపును చిటికెలో వదిలించే చిట్కాలివిగో.. ట్రై చేసి చూడండి..
రాజస్థాన్‌లోని టోంక్.. ఫ్యామిలీ టూర్‎కి బెస్ట్.. ఏమి చూడాలంటే.?
రాజస్థాన్‌లోని టోంక్.. ఫ్యామిలీ టూర్‎కి బెస్ట్.. ఏమి చూడాలంటే.?
IPL 2025: 14 ఏళ్లకే 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీనే మార్చేసిన బుడ్డోడు..
IPL 2025: 14 ఏళ్లకే 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీనే మార్చేసిన బుడ్డోడు..
నటరాజన్‌ ను అందుకే ఆడించడం లేదన్న పీటర్సన్..
నటరాజన్‌ ను అందుకే ఆడించడం లేదన్న పీటర్సన్..
ఐదు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్టు..
ఐదు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్టు..
శిష్యుడు సెంచరీతో వీల్ చెయిర్ నుంచి లేచిన ద్రవిడ్
శిష్యుడు సెంచరీతో వీల్ చెయిర్ నుంచి లేచిన ద్రవిడ్