AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు IAS అధికారి.. కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి.. నటనలో జాతీయ అవార్డ్..

చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో ఇతర రంగాల్లో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు సినీరంగంలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఒకరు. అతడు ఒకప్పుడు ఐక్యరాజ్యసమితిలో పనిచేశాడు. ఆ తర్వాత IAS అధికారిగా పనిచేశాడు. కానీ అన్నింటిని వదులుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా.. ?

Tollywood: ఒకప్పుడు IAS అధికారి.. కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి.. నటనలో జాతీయ అవార్డ్..
Paparao Biyyala
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 30, 2025 | 3:15 PM

Share

భారతదేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ఉద్యోగానికి ఎంత గౌరవం ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ జాబ్‌ను సాధించాలని ఎంతో మంది కలలు కంటారు. లక్షలాది మంది యువత UPSC పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనుకుంటారు. కానీ మీకు తెలుసా.. ఇప్పడు ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు ఒకప్పుడు ఆయన IAS ఆఫీసర్. తన ఉద్యోగాన్ని వదిలి పెట్టి సినీరంగంలోకి అడుగుపెట్టారు. సినిమాలు అంటే ఇష్టం.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దీంతో కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి పెట్టి సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆయన ఇండస్ట్రీలోనూ సక్సెస్స అయ్యారు. తన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఆయన మరెవరో కాదు.. బీవీపీ రావు అలియాస్ పాపారావు బియ్యాల.

పాపారావు బియ్యాల.. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 30 ఏళ్లు వివిధ ప్రాంతాల్లో అనేక పదవులలో పనిచేశారు. 1994 నుండి 1997 వరకు అస్సాం హోం కార్యదర్శిగా ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1999లో ఆయన ఐక్యరాజ్యసమితి మిషన్ కింద కొసావోలో పౌర వ్యవహారాల అధికారిగా పనిచేశారు. 2014 నుండి 2019 వరకు, ఆయన తెలంగాణ ప్రభుత్వంలో విధాన సలహాదారుగా ఉన్నారు. ఇది క్యాబినెట్ మంత్రి హోదాకు సమానం. అయితే నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన స్నేహితుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ టామ్ ఆల్టర్.. పాపారావును జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన చిత్రనిర్మాత జాహ్ను బారువాకు పరిచయం చేశారు. 1996లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి ఆయన చిత్రనిర్మాణంలో డిప్లొమా కంప్లీట్ పాపారావు బియ్యాల. ఆయన తీసిన మొదటి షార్ట్ ఫిల్మ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ పర్యావరణ పరిరక్షణపై ఉత్తమ నాన్-ఫీచర్ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది.

Paparao Biyyala Life

Paparao Biyyala Life

2020 సంవత్సరంలో, అతను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రాజీనామా చేసి సినిమాల్లోకి వచ్చారు. 2023లో మ్యూజిక్ స్కూల్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఇందులో శ్రియ శరణ్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాపారావు బియ్యాలా.. కలెక్టర్ వీధుల కంటే ఒక సినిమాను తెరకెక్కించడం అత్యంత సవాలుగా అనిపిస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..