AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan : హోంబాలే బ్యానర్ పై హృతిక్ రోషన్ సినిమా.. దర్శకుడిగా టాలీవుడ్ స్టార్ హీరో.. ఇక బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..

కన్నడ సినీరంగంలో డిమాండ్ ఉన్న అతి పెద్ద నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Hrithik Roshan : హోంబాలే బ్యానర్ పై హృతిక్ రోషన్ సినిమా.. దర్శకుడిగా టాలీవుడ్ స్టార్ హీరో.. ఇక బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..
Hrithik Roshan
Rajitha Chanti
|

Updated on: May 30, 2025 | 10:49 AM

Share

కన్నడ సినీరంగంలో అనేక హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్. ఈ సంస్థ బ్యానర్ పై నిర్మాత కిరగందూర్ విభిన్న చిత్రాలను తెరకెక్కించేందుకు పెద్దపీట వేస్తున్నారు. ఇన్నాళ్లు కన్నడలో సినిమాలు నిర్మించిన ఈ సంస్థ.. ఇప్పుడు తెలుగు, తమిళం భాషలలోకి అడుగుపెడుతుంది. ఇక తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సైతం ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. హోంబాలే ఫిల్మ్స్ సంస్థ ఇప్పుడు స్టా్ర్ హీరో హృతిక్ రోషన్ తో చేతులు కలిపింది. ఈ సంస్థ పై హృతిక్ ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాకు దక్షిణాది స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. నిజానికి పృథ్వీరాజ్, హోంబాలే ఫిల్మ్స్ మధ్య మంచి సంబంధం ఉంది. ఇంతకు ముందు తెలుగులో వచ్చిన సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ నటించారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించగా.. హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే మూవీ సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ సినిమాకు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించనున్నారని టాక్ నడుస్తోంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

పృథ్వీరాజ్ నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’, ‘ఎల్2: ఎంపురాన్’ చిత్రాలకు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి పృథ్వీరాజ్ దర్శకుడిగా మారనుండడంతో హృతిక్ సినిమాపై హైప్ నెలకొంది.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..