Paresh Rawal: నిర్మాతలకే షాకిచ్చిన పరేష్ రావల్.. ఆస్తులు తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు పరేష్ రావల్. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టు. కానీ ఇప్పుడు అతడు పేరా ఫెరి 3 సినిమా నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో చిత్రాల్లో నటించి అత్యంత డిమాండ్ ఉన్న హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

బాలీవుడ్ టాప్ కమెడియన్ పరేష్ రావల్ ఇటీవల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ సీక్వెల్ హేరా ఫేరి 3 సినిమా నుంచి తప్పుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా 1, 2 పార్టులలో నటించిన ఆయన.. ఇప్పుడు ఆకస్మాత్తుగా హేరా ఫేరి 3 ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం అందరికి షాకిచ్చింది. ఇదే విషయంపై ఇప్పటికే ఆయనకు నిర్మాతలు నోటీసులు పంపించారు. ఈ సినిమా కోసం అతడు తీసుకున్న రెమ్యునరేషన్ తోపాటు వడ్డీ సహా తిరిగి ఇవ్వాల్సిందే అంటూ నోటీసులు పంపించారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు పరేష్ రావల్ పర్సనల్ లైఫ్ గురించి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అతడి ఆస్తులు, లైఫ్ స్టైల్ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ పరేష్ రావల్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
పరేష్ రావల్.. 30 మే 1955న జన్మించారు. గుజరాతీ కుటుంబానికి చెందిన పరేష్ రావల్.. 1982లో ‘నసీబ్ నహీ బల్హారీ’ అనే గుజరాతీ చిత్రంతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హిందీ సినిమా పరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించారు. విభిన్నమైన పాత్రలు పోషించి తన కామెడీతో ప్రేక్షకులను అలరించారు. 2000లో వచ్చిన ‘హేరా ఫేరీ’ చిత్రంలో బాబు భయ్యా పాత్రతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఇందులో ఆయన యాక్టింగ్, కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు.
ప్రస్తుతం ఆయన చేతిలో ఏకంగా 7 సినిమాల వరకు ఉన్నాయి. ఇక పరేష్ రావల్ ఆస్తుల విషయానికి వస్తే.. నివేదికల ప్రకారం రూ.200 కోట్లు ఉన్నట్లు అంచనా. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన హాస్యనటులలో ఒకరు. అక్షయ్ కుమార్ తో కలిసి ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. పరేష్ 1987లో స్వరూప్ సంపత్‌ను వివాహం చేసుకున్నాడు. పరేష్ ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటాడు. ‘హేరా ఫేరి 3’ సినిమా కోసం అతను రూ.11 లక్షల అడ్వాన్స్ చెల్లింపు అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..




