AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 28 ఏళ్ల క్రితం బాక్సాఫీస్‏ను షేక్ చేసిన ప్రేమకథ.. ఇప్పటికీ భారీ క్రేజ్.. ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా..

సినీప్రియుల హృదయాల్లో ఎన్నో ప్రేమకథలు ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాయి. ఒకప్పుడు పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. కొన్ని ప్రేమకథలు భారీ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ జనాల మనసులలో నిలిచిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ చిత్రాల్లో ఒక హిట్ మూవీ గురించి మాట్లాడుకుందాం.

Cinema : 28 ఏళ్ల క్రితం బాక్సాఫీస్‏ను షేక్ చేసిన ప్రేమకథ.. ఇప్పటికీ భారీ క్రేజ్.. ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా..
Cinema (3)
Rajitha Chanti
|

Updated on: Nov 01, 2025 | 9:31 PM

Share

సాధారణంగా జనాల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అనేక సంవత్సరాల క్రితం విడుదలైన చిత్రాలను మళ్లీ మళ్లీ చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన సినిమాపై ఉన్న క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ చాలా మందికి ఆ సినిమా ఫేవరేట్. అందమైన ప్రేమకథతోపాటు గుండెలు ముక్కలు చేసే విషాదాన్ని సైతం ఆ సినిమా చూపించింది. నేటికీ, ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎమోషనల్ అవుతుంటారు. బ్లాక్ బస్టర్ సినిమా ఆకట్టుకునే కథాంశంలోని ప్రతి ఫ్రేమ్‌తో ప్రేక్షకులు తమను తాము కనెక్ట్ చేసుకునేవారు. ఈ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తరచుగా ట్రెండ్ అవుతాయి. ఈ సినిమా పేరు ‘టైటానిక్’. 1997లో విడుదలైన ఈ సినిమా అమెరికన్ విపత్తు మూవీ.

ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్‏మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 19, 1997న విడుదలైంది. ఈ సినిమాలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ ప్రధాన పాత్రలు పోషించారు.’టైటానిక్’ చిత్రంలో జాక్ డాసన్ పాత్రలో లియోనార్డో డికాప్రియో, రోజ్ డెవిట్ బుకెట్ పాత్రలో కేట్ విన్స్లెట్ నటించారు. బిల్లీ జీన్, కాథీ బేట్స్, ఫ్రాన్సిస్ ఫిషర్, గ్లోరియా స్టీవర్ట్ కీలకపాత్రలు పోషించారు. ‘టైటానిక్’ సినిమా ఒక నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా రోజ్ అనే ధనిక అమ్మాయి, జాక్ అనే పేద అబ్బాయి ప్రేమకథను తెలియజేస్తుంది. 28 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి.. ‏ ఇది 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. దీనికి IMDBలో 7.9 రేటింగ్ వచ్చింది. అప్పట్లో అత్యధిక వసూలు చేసిన సినిమా టైటానిక్. ఈ చిత్రం సినిమాటోగ్రఫీ, నటన, సంగీతం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ‘టైటానిక్’ సినిమాను 200 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన సినిమా ఇది. ఈ సినిమా రూ.18,800 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ట్రెండింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..