Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : డబ్బుల కోసం పెళ్లిల్లో ఫుడ్ సర్వర్‏గా పనిచేసింది.. కట్ చేస్తే.. స్పెషల్ పాటలతో రచ్చ చేసిన హీరోయిన్..

ఇండస్ట్రీలో హీరోయిన్లుగా స్టార్ డమ్ సంపాదించుకోవడం అంటే మాములు విషయం కాదు.. ఎన్నో సవాళ్లు అధిగమించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ ఆ క్రేజ్ కాపాడుకోవడం మాత్రం కొందరు విఫలమవుతుంటారు. సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు.. ఇప్పుడు కనిపించకుండా పోయారు. అందులో ఈ బ్యూటీ ఒకరు.

Tollywood : డబ్బుల కోసం పెళ్లిల్లో ఫుడ్ సర్వర్‏గా పనిచేసింది.. కట్ చేస్తే.. స్పెషల్ పాటలతో రచ్చ చేసిన హీరోయిన్..
Rakhi Sawanth
Rajitha Chanti
|

Updated on: Jun 17, 2025 | 7:17 PM

Share

సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే అనేక అవమానాలు, సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుని తమకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటారు. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుని ఆ తర్వాత ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. చిన్నప్పుడే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడింది. చిన్న చిన్న పనులు చేసింది. కుటుంబానికి అండంగా ఉండేందుకు దొరికిన ప్రతి చిన్న పని చేసింది. ఒకప్పుడు పెళ్లి వేడుకలలో ఫుడ్ సర్వర్ గా పనిచేసింది. తక్కువ జీతం వచ్చినప్పటికీ కొన్నాళ్లపాటు అదే పని చేసిన ఈ అమ్మడు.. ఆతర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టింది. గ్లామర్ ప్రపంచంలో నటిగా ఓ వెలుగు వెలిగింది. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కట్ చేస్తే.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనవసర వివాదాల్లో చిక్కుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ముఖ్యంగా స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. తనే అందాల తార రాకీ సావంత్.

ఆనతి కాలంలోనే బీటౌన్ లో ఫేమస్ అయిన రాకీ సావంత్..వ్యక్తిగత జీవితం సైతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 1978 నవంబర్ 25న ముంబైలో జన్మించిన రాకీ సావంత్ అసలు పేరు నెహ్రు బేడా. ఆమె తండ్రి వర్లీలో కానిస్టేబుల్. కానీ తండ్రి సంపాదన కుటుంబ ఆర్థిక కష్టాలను తగ్గించలేకపోయింది. దీంతో పదేళ్లకే ఉద్యోగాలు చేయడం స్టార్ట్ చేసింది రాకీ సావంత్. ముంబైలోని ఓ క్యాటరింగ్ సర్వీస్ లో ఫుడ్ సర్వర్ గా పనిచేసింది. అప్పట్లో పెళ్లి వేడుకలకు ఫుడ్ సర్వర్ గా చేస్తే తనకు రూ.50 జీతం ఇచ్చేవారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇది మాత్రమే కాకుండా ఆ సమయంలో తనకు వచ్చిన ప్రతి పని చేసి కుటుంబానికి అండగా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చానని.. కానీ సినిమాల్లో నటించడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని తెలిపింది.

దీంతో తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చానని తెలిపింది. అయితే కెరీర్ తొలినాళ్లల్లో ఆమె శరీరం, రూపంపై విమర్శలు రావడంతో ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అగ్నిచక్రం సినిమాతో వెండితెరకు పరిచయమైన రాకీ.. స్పెషల్ పాటలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. అయితే రాకీ సావంత్ పెళ్లిళ్లు.. విడాకులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. కొన్నాళ్ల క్రితం దుబాయ్ వెళ్లిన్నట్లు తెలిపింది రాకీ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది రాకీ.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో