Disha Patani: ఇన్‌స్పయిర్ చేసే మాటలతో యూత్‌ని తనవైపుకు తిప్పుకుంటున్న దిశా పాట్ని
దిశా పాట్ని చెప్పే విషయాలు ఇప్పటి యూత్‌ని ఇన్‌స్పయిర్ చేస్తున్నాయి. ఎవరికీ సక్సెస్ ఈజీ రూట్ కాదని ఆమె ఎగ్జాంపుల్ ఇచ్చిన తీరు ఆసమ్ అని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఇంతకీ అంతలా జనాలను మెప్పించే విషయాలు ఆమె ఏం చెప్పినట్టు? మరేం ఫర్వాలేదని అంటున్నారు దిశా పాట్ని. ఏ విషయంలో ఫర్వాలేదని అడిగితే.. విషయం ఏదైనా ఫర్వాలేదనే అంటున్నారు.
Updated on: Jun 17, 2025 | 7:43 PM

మరేం ఫర్వాలేదని అంటున్నారు దిశా పాట్ని. ఏ విషయంలో ఫర్వాలేదని అడిగితే.. విషయం ఏదైనా ఫర్వాలేదనే అంటున్నారు. చెప్పే విషయాన్నిసూటిగా చెప్పమని అడిగితే చిరు నవ్వులు చిందిస్తూ.. కెరీర్ గురించి ఎక్కువ ఆలోచించవద్దని చెబుతున్నారు.

పర్ఫెక్ట్ టైమ్‌లో మరింత పర్ఫెక్ట్ గా అన్నీ జరిగి తీరుతాయని నమ్మమని సలహా ఇస్తున్నారు. దిశా పాట్ని కెరీర్ తొలినాళ్లలో ప్రతి రోజూ ఏదో ఒక ఆడిషన్‌కి వెళ్లేవారట. ఎక్కువగా కమర్షియల్స్ మీద ఫోకస్ చేసేవారట.

అప్పట్లో ముంబైకి జస్ట్ 500 రూపాయలతో వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారీ బ్యూటీ. వరుస ఆడిషన్స్ తర్వాత ఓ అవకాశం తలుపు తట్టిందట దిశా పాట్నికి. అయితే ఆ సినిమా మేకర్స్ మాత్రం ఆమెకు చెప్పాపెట్టకుండా సినిమా నుంచి తీసేశారట.

ఇంకెవరైనా అయితే ఆ రోజు మూడ్ అవుట్ అయ్యేవారని, తాను మాత్రం రెట్టింపు ఉత్సాహంతో మరో అవకాశాన్ని వెతుక్కున్నాననీ చెప్పారు దిశా. తనను అవతలివారు తిరస్కరించారని ఎప్పుడూ బాధపడలేదట దిశా పాట్ని.

ఇంతకు మించి ఇంకేదో ఉందనే ఆశాభావంతోనే ముందడుగేశానని చెబుతున్నారీ బ్యూటీ. ఇవాళ హాలీవుడ్ అవకాశాలు రావడానికీ తనలోని ఆత్మవిశ్వాసమే కారణమని చెబుతున్నారు ఈ బ్యూటీ.



