- Telugu News Photo Gallery Cinema photos Pooja Hegde Shares Latest Beautifull Saree Photos Goes Viral in Social Media
Pooja Hegde: పట్టుచీరలో మెరిసిన బుట్టబొమ్మ.. చూపుల బాణాలు వేస్తోన్న సొగసరి..
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. కొన్నాళ్లపాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన వయ్యారి. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అగ్ర హీరోలతో ఎన్నో హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం సరైన ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. తాజాగా పట్టుచీరలో మరింత అందంగా మెరిసిపోయింది.
Updated on: Jun 17, 2025 | 8:48 PM

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పట్టుచీరలో మెరిసింది. జామున్ కలర్ కాంజీవరం చీరలో ఎంతో అందంగా కనిపిస్తుంది. కలువ కన్నులతో చూపుల బాణాలు వేస్తోన్న ఈ వయ్యారి.. సంప్రదాయ పద్దతిలో చేసిన ఫోటోషూట్స్ ఇప్పుడు ఇన్ స్టాలో షేర్ చేసింది. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన పూజా హెగ్డే.. ఇప్పుడు మాత్రం ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. తెలుగుతోపాటు తమిళంలో అగ్ర హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, విజయ్ దళపతి, సూర్య, నాగ చైతన్య వంటి స్టార్స్ సరసన కనిపించింది.

కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఈ వయ్యారికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకుంటూ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కానీ అక్కడ సైతం ఈ ముద్దుగుమ్మకు నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు తిరిగి సౌత్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే సూర్య జోడిగా రెట్రో సినిమాలో నటించింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ టాక్ అందుకుంది. దీంతో పూజాకు మళ్లీ అవకాశాలు కరువయ్యాయి. అయితే హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్స్ కోసం చూస్తుంది పూజా హెగ్డే. ప్రస్తుతం జననాయగన్ సినిమాలో నటిస్తుంది. విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాతకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో మమితా బైజు, బాబీ డివోల్, ప్రియమణి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది పూజా. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నారు.



















