Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ హనుమంతుడిగా నటించిన సినిమా ఎదో తెలుసా..?
తనదైన కామెడీ టైమింగ్ తో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఆ తర్వాత ఆయన పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు కూడా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. మరో వైపు ప్రధాన పాత్రలు చేస్తూ కేవలం కామెడీనే కాదు సెంటిమెంట్ ను కూడా పండించగలను అని నిరూపించుకుంటున్నారు.
విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఒకప్పుడు హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. తనదైన కామెడీ టైమింగ్ తో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఆ తర్వాత ఆయన పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు కూడా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. మరో వైపు ప్రధాన పాత్రలు చేస్తూ కేవలం కామెడీనే కాదు సెంటిమెంట్ ను కూడా పండించగలను అని నిరూపించుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్. ఇదిలా ఉంటే రాజేంద్ర ప్రసాద్ హనుమంతుడి పాత్రలో నటించిన సినిమా ఎదో మీకు తెలుసా..? ఇది కొంచం కష్టమైన సవాలే. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ పౌరాణిక సినిమాల్లో నటించిన సందర్భాలు చాలా తక్కువ
ఇంతకు రాజేంద్ర ప్రసాద్ హనుమంతుడిగా నటించిన సినిమా ఏదంటే.. దేవుళ్ళు. కోడిరామకృష్ణ దర్శకత్వంలో 2000వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చాలా మంది దేవుళ్ళ గురించి చూపించారు దర్శకుడు కోడి రామకృష్ణ.
ఈ సినిమాలో శ్రీరాముడి కథను తెలుపుతూ హనుమంతుడి పాత్రలో కనిపించరు రాజేంద్ర ప్రసాద్. శ్రీ రాముడిగా శ్రీకాంత్ కనిపించగా హనుమంతుడి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తండ్రి, పోలీస్ ఆఫీసర్, పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా జులాయి, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, అలవైకుంఠపురం లో సినిమాలో ఆయన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.