Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగేళ్లుగా స్టార్ హీరోతో సహజీవనం.. పెళ్లి కాకుండానే రెండోసారి తల్లికాబోతున్న నటి..!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా కలిసి నటించిన 'ఊపిరి' సినిమా గుర్తుందా? ఈ మువీలో నటించిన గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. సౌత్‌ ఆఫ్రికాకు చెందిన గాబ్రియెల్లా మోడల్‌గా..

నాలుగేళ్లుగా స్టార్ హీరోతో సహజీవనం.. పెళ్లి కాకుండానే రెండోసారి తల్లికాబోతున్న నటి..!
Gabriella Demetriades
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 23, 2023 | 10:48 AM

అక్కినేని  అందగాడు నాగార్జున, కార్తీ, తమన్నా కలిసి నటించిన ‘ఊపిరి’ సినిమా గుర్తుందా? ఈ మువీలో నటించిన గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. సౌత్‌ ఆఫ్రికాకు చెందిన గాబ్రియెల్లా మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, పలు మువీల్లో నటించింది కూడా. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో నటి గాబ్రియెల్లా గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఈ జంటకు ఇప్పటికే ఓ కొడుకు (Arik Rampal) కూడా జన్మించాడు. తాజాగా మరోసారి నటి గాబ్రియెల్లా గర్భం దాల్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంది. యోగా డే సందర్భంగా గాబ్రియెల్లా బేబీబంప్‌తో యోగాసనాలు వేసింది. ఆ ఫోటోలు, వీడియోలను కూడా ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పెళ్లికాకుండానే రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్‌ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ రెండోసారి గర్భంపై నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. పెళ్లెప్పుడు చేసుకుంటారు..? ఎంత మంది పిల్లలను కన్నాక పెళ్లి పీటలెక్కుతారంటూ.. ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. అర్జున్, గాబ్రియెల్లా 2018 నుంచి సహజీవనం చేస్తున్నారు. ఈ జంటకు 2019లో కుమారుడు అరిక్ రాంపాల్‌ కు జన్మనిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 29న మరోసారి గర్భం ధరించినట్లు గాబ్రియెల్లా వెల్లడించింది. ఈ లవ్‌బర్డ్స్‌ ఇప్పటివరకు అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. మరోవైపు అర్జున్ రాంపాల్‌కు ఇది వరకే పెళ్లి అయ్యి, భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.