Shruti Haasan: మీరు మద్యం తాగుతారా.? నెటిజన్ ప్రశ్నకు శ్రుతిహాసన్ ఏమన్నారంటే
లోకనాయకుడు కమల్ హాసన కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శృతిహానస్. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందుకు పలు సినిమాల్లో చిన్న గెస్ట్ రోల్స్ చేసింది ఈ భామ. ఆ తర్వాత అనగనగ ఓ ధీరుడు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

సినీ ఇండస్ట్రీలో నట వారసులు చాలా మంది ఉన్నారు. అయితే కేవలం వారసులు అయినంత మాత్రాన స్టార్ డమ్ రాదు. టాలెంట్ లేకుంటే ప్రేక్షకులు ఆదరించారు. ఎంత పెద్ద హీరోల కొడుకు, కూతురైనా కూడా ప్రేక్షకులు ఆదరించాల్సిందే. దాంతో తన టాలెంట్ తో కొంతమంది తండ్రికి తగ్గ కొడుకు, కూతురు అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో శ్రుతిహాసన్ ఒకరు. లోకనాయకుడు కమల్ హాసన కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శృతిహానస్. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందుకు పలు సినిమాల్లో చిన్న గెస్ట్ రోల్స్ చేసింది ఈ భామ. ఆ తర్వాత అనగనగ ఓ ధీరుడు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ. ఆతర్వాత పవర్ స్టార్ గబ్బర్ సింగ్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఆతర్వాత ఈ చిన్నది వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ్ లోనూ, హిందీలోనూ సినిమాలు చేసింది. అలాగే ఈ అమ్మడు సింగర్ కూడా.. అడపాదడపా తనలోని సింగర్ ను కూడా బయట పడుతూ ఉంటుంది. రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలయ్యతో కలిసి వీరసింహారెడ్డి సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది.
ఇక ఇప్పుడు ప్రభాస్ తో కలిసి సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే నేచురల్ స్టార్ నానితో కలిసి నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వీలు దొరికినప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు అభిమానులతో మాట్లాడింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆమెను మీరు మద్యం తాగుతారా? అని ప్రశ్నించాడు. దానికి శ్రుతి బదులిస్తూ..లేదు నేను మద్యం తాగాను. ఎలాంటి మాదక ద్రవ్యాలను తీసుకొని.. చాలా సంతోషంగా నా జీవితాన్ని గడుపుతున్నాను అని బదులిచ్చింది శృతి.