Tollywood: పెళ్లి కాకుండానే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న హీరోయిన్. తొలి చిత్రంతోనే మంచి క్రేజ్ అందుకున్న వయ్యారి.. ఆ తర్వాత ఏకంగా అరడజనుకుపైగా ఆఫర్స్ అందుకుని ఆశ్చర్యపరిచింది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది.

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న క్రేజీ హీరోయిన్లలో ఆమె ఒకరు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే నటిగా మెప్పించిన ఈ అమ్మడు.. సెకండ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో తెలుగులో ఒక్కసారిగా ఆఫర్స్ పెరిగిపోయాయి. వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ అమ్మడు ఖాతాలో కొన్ని డిజాస్టర్స్ కూడా చేరాయి. దీంతో ఈ అమ్మడు కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉన్న ఆ వయ్యారి.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకుంటున్న ఆ అమ్మాయి చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఆ ఇద్దరి ఆలనపాలన దగ్గరుండి చూసుకుంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ శ్రీలీల.
ఇన్నాళ్లు కథానాయికగా వరుస హిట్స్ అందుకున్న శ్రీలీల.. మొదటి సారి స్పెషల్ సాంగ్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమాక్ కాంబోలో వచ్చిన పుష్ప 2లో కిస్సిక్ పాటకు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇందులో కిస్సిక్ పాటకు శ్రీలీల, బన్నీ స్టెప్పులు చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. గత రెండేళ్లలో శ్రీలీల మూడు మెగా బడ్జెట్ చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీలీలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతుంది. అదెంటంటే.. శ్రీలీల ఇదివరకే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుందట.
ప్రస్తుతం శ్రీలీల వయసు 23 ఏళ్లు. అయితే కేవలం 21 ఏళ్లకే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఆమె నటించిన ‘బై టూ లవ్’ సినిమా ప్రమోషన్స్ కోసం గతంలో మాతృశ్రీ మనోవికాస కేంద్రాన్ని సందర్శించింది. బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల కోసం ఇది ప్రత్యేక పాఠశాల. శ్రీలీల ఇక్కడ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. గురు, శోభిత అనే ఇద్దరి పిల్లలను దత్తత తీసుకుని వారికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తుంది. అలాగే ఆ ఇద్దరి పిల్లల భవిష్యత్తుకు పూర్తి బాధ్యత తీసుకుంది.
శ్రీలీల 14 జూన్ 2001న అమెరికాలోని మిచిగాన్‌లో జన్మించింది. తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్. శ్రీలీల చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకుంది. తన తల్లిలాగే డాక్టర్ కావాలనుకుంది. అటు ఎంబీబీఎస్ చదువుకుంటూనే ఇటు సినీరంగంలోకి బాలనటిగా అడుగుపెట్టింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
View this post on Instagram
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




