Allu Arjun: అల్లు అర్జున్‌తో ఆ సినిమా చేయాలనుకున్న సుకుమార్.. కానీ ఎలా మిస్సయ్యిందంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరో. పుష్ప 1 సినిమాతో ఈ హీరో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో దూసుకుపోతుంది పుష్ప 2 మూవీ.

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మరోసారి థియేటర్లలో అదరగొట్టేస్తోంది. గతంలో పుష్ప 1తో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ కాంబో.. ఇప్పుడు పుష్ప 2తో ఓ ఊపు ఊపేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో అల్లు అర్జున్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఆర్య. ఈ చిత్రాన్ని సైతం డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఇదే మూవీతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు సుక్కూ. వన్ సైడ్ లవ్ అంటూ సరికొత్త కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో అల్లు అర్జున్ కు స్టార్ డమ్ వచ్చేసింది. అయితే ఆర్య తర్వాత రామ్ పోతినేని హీరోగా జగడం సినిమా తీశారు సుకుమార్. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే ఈ సినిమాను ముందు బన్నీతో తీయాలనుకున్నారట సుకుమార్. కానీ దిల్ రాజుతో జరిగిన చిన్న ఇష్యూతో రామ్ పోతినేనితో చేయాల్సి వచ్చిందట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎలా మాట్లాడాలో తెలిసేది కాదని.. కానీ ఆర్య హిట్ కావడంతో గాల్లో తేలిపోయా అన్నారు సుకుమార్. ఆ తర్వాత వెంటనే బన్నీతో జగడం సినిమా చేయాలనుకున్నానని.. అన్ని సిద్ధమయ్యాక దిల్ రాజుతో చిన్న సమస్య వచ్చిందని.. దీంతో కోపం పట్టలేకపోయానని అన్నారు సుకుమార్. వెంటనే రామ్ దగ్గరు వెళ్లిపోయి కథ చెప్పి ఓకే చేయించానని.. ఆ మరుసటి రోజే ముహుర్తం కూడా పెట్టించానని.. కానీ ఆ రోజు రాజుగారు వచ్చి తనపై కోప్పడ్డారని చెప్పారు.
కథలో మార్పు చేయాలి.. ఈ మార్పు చేయాలని అంటున్నారని.. అందుకే కుదరదని చెప్పేశానని.. ఫస్ట్ మూూవీ హిట్ కావడంతో తన జడ్జిమెంట్ ఎవరైనా తప్పు అని చెబితే కోపం వచ్చేదని.. రామ్ చేసిన పాత్ర బన్నీ లేదా మహేష్ అయితే బాగుండేదని.. అతడి తమ్ముడి పాత్రకు రామ్ అయితే సరిపోయేవాడని అన్నారు. జగడం సినిమా ప్లాప్ తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని.. ఆ తర్వాత ఎవరూ ఏం చెప్పినా విన్నానని గతంలో ఓ సందర్భంలో పంచుకున్నారు సుకుమార్.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




