Silk Smitha : ఏంది భయ్యా ఇది.. గ్లామర్ క్వీన్ సిల్క్ స్మిత సీరియల్లో నటించిందా.. ? ఎప్పుడంటే..
సిల్క్ స్మిత.. ఇప్పటికీ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు భారతీయ సినీపరిశ్రమను ఏలేసిన గ్లామర్ క్వీన్. అప్పట్లో స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ. అందం, అభినయంతో ఇండస్ట్రీని శాసించిన ఈ అమ్మడు.. అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలేసింది. ఇప్పటికీ ఆమె ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.

భారతీయ సినీపరిశ్రమలో గ్లామర్ క్వీన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సిల్క్ స్మిత. దక్షిణాదిలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న అందాల రాశి. నిషా కళ్లు.. చూడచక్కని రూపంతో కట్టిపడేసింది. అప్పట్లోనే గ్లామర్ ప్రపంచాన్ని ఏలేసింది. స్పెషల్ పాటలతో రచ్చ చేసింది. భారతీయ సినిమా పరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసిన సిల్క్ స్మిత.. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషలలో నటించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సిల్క్ స్మిత జీవితంపై ఇదివరకు అనేక చిత్రాలను తెరకెక్కించారు. కానీ మీకు తెలుసా.. సిల్క్ స్మిత ఒకే ఒక సీరియల్లో నటించింది. ఇటీవల ఆ సీరియల్ దర్శకుడు మాట్లాడుతూ, అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్‌కు కూడా ఆ సీరియల్ ఏమిటో తెలియదని అన్నారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..
80లలో ప్రముఖ గ్లామర్ నటిగా గుర్తింపు పొందిన సిల్క్ స్మిత తన నటనతోనే కాకుండా తన గొంతుతో సైతం కట్టిపడేసింది. మలయాళ చిత్రాలలో అరంగేట్రం చేసిన సిల్క్ స్మిత, వండిచ్ఛక్కారం చిత్రంతో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. సిల్క్ స్మిత నటిగా కొన్ని చిత్రాలలో నటించింది. స్పెషల్ పాటలతో మరింత ఫేమస్ అయ్యింది. ఆమెకు ఇప్పటికీ చాలా మంది అభిమానులు ఉన్నారు.90వ దశకంలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గానూ కనిపించింది. కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్న సిల్క్ స్మిత 1996లో చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణించి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ, అభిమానులు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఆమె గురించి ఏదోక విషయం సెర్చ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
ఇటీవల జరిగిన సాయి విత్ చిత్ర షోలో పాల్గొన్న దర్శకుడు దళపతి మాట్లాడుతూ.. “సిల్క్ స్మిత నటించిన సీరియల్ పేరు కళ్యాణ పండల్. నేను ఆ సీరియల్ డైరెక్టర్‌ని. అప్పుడే నాకు ఆమెతో స్నేహం ఏర్పడింది. అందుకే నా మొదటి సినిమాలో ఆమెను ఎంపిక చేసుకున్నాను. ఆ సినిమాలోఆమెను గ్లామరస్ గా చూసి ఉండవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఆమె చాలా హోమ్లీ మహిళ. ఆమె స్నేహపూర్వకంగా ఉంటుంది. నిజానికి, ఆ సమయంలో ఆమెకు రోజుకు లక్ష రూపాయలు జీతం ఇచ్చేవారు. కానీ ఈ సీరియల్ లో తాను ప్రియా పాత్ర పోషించానని చెప్పాలని ఉందని ఆమె చెప్పింది” అనుకుంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..








