AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : రాయల్ స్టైలీష్ లుక్‏లో అద్భుతంగా కనిపించిన సమంత.. ఆ డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకోవడానికి యూఎస్ వెళ్లిన సమంత.. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన 41వ ఇండిపెండెన్స్ పరేడ్‏లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో సామ్ రాయల్ అండ్ స్టైలీష్ లుక్ లో అందం మరింత అద్భుతంగా మారినట్లుగా కనిపించింది. ముఖ్యంగా సామ్ తన న్యూలుక్‏తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఈ వేడుకల కోసం ఆమె డిజైనర్ రీతూ కుమార్ డిజైన్ చేసిన ఆధునిక, సాంప్రదాయ దుస్తులను ధరించింది.

Samantha : రాయల్ స్టైలీష్ లుక్‏లో అద్భుతంగా కనిపించిన సమంత.. ఆ డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Samantha
Rajitha Chanti
|

Updated on: Aug 24, 2023 | 3:14 PM

Share

సమంత.. గత కొన్నాళ్లుగా నిత్యం వార్తలలో నిలుస్తోన్న పేరు. ఇటీవల బాలి వెకేషన్ పూర్తిచేసుకుని వచ్చిన సామ్.. ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తుంది. మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకోవడానికి యూఎస్ వెళ్లిన సమంత.. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన 41వ ఇండిపెండెన్స్ పరేడ్‏లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో సామ్ రాయల్ అండ్ స్టైలీష్ లుక్ లో అందం మరింత అద్భుతంగా మారినట్లుగా కనిపించింది. ముఖ్యంగా సామ్ తన న్యూలుక్‏తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఈ వేడుకల కోసం ఆమె డిజైనర్ రీతూ కుమార్ డిజైన్ చేసిన ఆధునిక, సాంప్రదాయ దుస్తులను ధరించింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. ఇక సామ్ న్యూలుక్ బ్యూటీఫుల్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇంకేముంది సమంత ధరించిన ఆ లేటేస్ట్ డ్రెస్ ధర గురించి నెట్టింట సెర్చింగ్ జరుగుతుంది. అద్భుతమైన ఎంబ్రాయిడరీ కార్పెట్, ప్యాంట్, కోట్ ధరించిన ఆ డ్రెస్ విలువ రూ.2.95 లక్షలు. సామ్ డ్రెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.

రీతూ కుమార్ డిజైన్ చేసిన దుస్తులలో బంగారు తార్ వర్క్, నారింజ, ఆకుపచ్చ, మెరూన్ లో సీక్విన్ అలంకారాలతో కలర్ ఫుల్ కార్సెట్ కనిపిస్తుంది. ఆలాగే స్ట్రాప్లెస్ బ్లౌజ్, డేరింగ్ ప్లంగింగ్ నెక్ లైన్, బాడీ హగ్గింగ్ సిల్హౌట్ ను కలిగి ఉంటుంది. రిచ్ బ్రౌన్ ప్యాటర్న్ లలో హై వెయిస్ట్ ఫ్లేర్డ్ ట్రౌజర్ లలో సరిపోతుంది. ఈ అందమైన దుస్తులకు సరిపోయేంతగా.. ఆమె స్పైరల్ మెటాలిక్ వాచ్, రత్నాలు పొదిగిన లాకెట్టు నెక్లెస్, ఇయర్ స్టడ్స్, ఆక్సిడైజ్డ్ సిల్వర్ రింగ్, ట్రెండీ లెన్నాన్, లేతరంగు గల సన్ గ్లాసెస్ ధరించి మరింత స్పెషల్ అట్రాక్షన్ అయ్యాంది. దీంతో ఆమె 41వ ఇండిపెండెన్స్ పరేడ్ వేడుకలో అందరి చూపును ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

అలాగే అదే వేడుకలకు మరోసారి బ్లాక్ శారీలో మెరిసింది. అనంతరం న్యూయార్క్ వీధుల్లో నలుపు రంగు చీరకట్టులో సామ్ చేసిన ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆ ఫోటోలను మీరు ఒకసారి చూసేయ్యండి.

ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా ఖుషి చిత్రంలో నటించింది. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ చిత్రంలో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విన్నర్ రేంజ్‏లో తనూజ రెమ్యునరేషన్..
విన్నర్ రేంజ్‏లో తనూజ రెమ్యునరేషన్..
ఉదయాన్నే ఈ శబ్ధాలు వినిపిస్తున్నాయా?..మీకు మంచి రోజులు వచ్చినట్లే
ఉదయాన్నే ఈ శబ్ధాలు వినిపిస్తున్నాయా?..మీకు మంచి రోజులు వచ్చినట్లే
వాస్తు టిప్స్ : మీ ఇంటిలో చెత్త బుట్ట ఈ దిశలో ఉంటే దరిద్రమే!
వాస్తు టిప్స్ : మీ ఇంటిలో చెత్త బుట్ట ఈ దిశలో ఉంటే దరిద్రమే!
ఇంతకీ దేవుడు ఉన్నాడా.. లేడా.. అసలు క్లారిటీ ఇదే!
ఇంతకీ దేవుడు ఉన్నాడా.. లేడా.. అసలు క్లారిటీ ఇదే!
2026లో ఈ తేదీల్లో జన్మించిన వారికి ఊహించని మలుపు.. మీరు ఉన్నారా?
2026లో ఈ తేదీల్లో జన్మించిన వారికి ఊహించని మలుపు.. మీరు ఉన్నారా?
పాత అకౌంట్లో డబ్బులు అలాగే ఉన్నాయా..? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు
పాత అకౌంట్లో డబ్బులు అలాగే ఉన్నాయా..? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ ఐదుగురు వీరుల వీరగాథ ఇది!
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ ఐదుగురు వీరుల వీరగాథ ఇది!
ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఎయిర్‌లైన్స్‌ నష్టాల్లో ఎందుకున్నాయి?
ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఎయిర్‌లైన్స్‌ నష్టాల్లో ఎందుకున్నాయి?
రీల్స్ మోజులో టైమ్ వేస్ట్ చేస్తున్నారా? 2025 లెక్క తేల్చుకోండి
రీల్స్ మోజులో టైమ్ వేస్ట్ చేస్తున్నారా? 2025 లెక్క తేల్చుకోండి
హీరోయిన్‌గా పనికిరానని మొహం మీదే చెప్పేవారు.. కట్ చేస్తే..
హీరోయిన్‌గా పనికిరానని మొహం మీదే చెప్పేవారు.. కట్ చేస్తే..