AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘బేబీ’.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవిల ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఎక్కడ చూడొచ్చంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'బేబీ' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కల్ట్‌ క్లాస్టిక్‌ లవ్‌ స్టోరీగా నిలిచిన ఈ బ్లాక్‌ బస్టర్ మూవీ ఇప్పుడు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. సాయి రాజేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బేబీ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ ఈ యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టోరీని నిర్మించారు.

Baby OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'బేబీ'.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవిల ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఎక్కడ చూడొచ్చంటే?
Baby Movie
Basha Shek
|

Updated on: Aug 24, 2023 | 2:30 PM

Share

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘బేబీ’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కల్ట్‌ క్లాస్టిక్‌ లవ్‌ స్టోరీగా నిలిచిన ఈ బ్లాక్‌ బస్టర్ మూవీ ఇప్పుడు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. సాయి రాజేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బేబీ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ ఈ యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టోరీని నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 14న విడుదలైన బేబీ సినిమా మొదటి షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్‌ ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అయ్యారు. దీంతో ఈ చిన్న సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిసింది. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన బేబీ సినిమా సుమారు రూ. 80 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా? అని యూత్‌ ఆసక్తిగా ఎదురుచూశారు. ముందుగానే స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉన్నప్పటికీ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ రావడంతో ఓటీటీ రిలీజ్‌ లేట్ అయ్యింది. అయితే ఎట్టకేలకు బేబీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా బేబీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది.

కాగా ఒప్పందం ప్రకారం శుక్రవారం (ఆగస్టు 25) నుంచి ‘బేబీ’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఆహా గోల్డ్‌ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి స్పెషల్‌ ఆఫర్‌ ప్రకటించింది ఓటీటీ సంస్థ. వీరు ఈరోజు (ఆగస్టు 24) నుంచే బేబీ సినిమాను చూడొచ్చు. ఆహా గోల్డ్‌ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ కోసం ఏడాదికి రూ.899 చెల్లించాల్సి ఉంటుంది. కాగా బేబీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఆహా సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టింది. ‘బంగారం ఏమ్‌ చేస్తున్నావ్‌. చెప్పు బేబీ ఏమ్‌ చేయమంటావ్‌. ఆహా గోల్డ్‌లో బేబీ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుంది. చూసేద్దామ్‌’ అని రాసుకొచ్చింది ఆహా. సో.. మరి థియేటర్‌లో ఓటీటీ సినిమాను మిస్‌ అయిన వారు, మళ్లీ చూడాలనుకునేవారు ఎంచెక్కా ఆహా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

బేబీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ట్వీట్

వైష్ణవి చైతన్య ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..