AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal: ‘యానిమల్’లో రణబీర్ తల్లిగా నటించిన చారు శంకర్ ఎవరో తెలుసా ?.. ఆమె వయసు తెలిస్తే షాకవుతారు..

ఓవైపు డంకీ, మరోవైపు సలార్ చిత్రాలు విడుదలై సెన్సెషన్ సృష్టిస్తోన్న యానిమల్ సినిమా హవా మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు అడియన్స్. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలు పోషించారు. తండ్రికొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ తమ అధ్భుతమైన నటనతో విమర్శకులను మెప్పించారు.

Animal: 'యానిమల్'లో రణబీర్ తల్లిగా నటించిన చారు శంకర్ ఎవరో తెలుసా ?.. ఆమె వయసు తెలిస్తే షాకవుతారు..
Charu Shankar
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2023 | 7:37 AM

Share

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన లేటేస్ట్ చిత్రం యానిమల్. డిసెంబర్ 1న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓవైపు డంకీ, మరోవైపు సలార్ చిత్రాలు విడుదలై సెన్సెషన్ సృష్టిస్తోన్న యానిమల్ సినిమా హవా మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు అడియన్స్. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలు పోషించారు. తండ్రికొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ తమ అధ్భుతమైన నటనతో విమర్శకులను మెప్పించారు. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాలో కనిపించిన నటీనటులు ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో హీరోయిన్ త్రిప్తి డిమ్రి పేరు మారుమోగిపోతుంది.

యానిమల్ ముందు.. ఆ తర్వాత త్రిప్తి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే ఇప్పుడు మరో నటి గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తల్లిగా కనిపించిన నటి ఎవరో తెలుసుకోవడానికి తెగ సెర్ చేస్తున్నారు నెటిజన్స్. రణబీర్ తల్లి పాత్రలో కనిపించిన నటి చారు శంకర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. యానిమల్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. “రణబీర్ కపూర్‏కు నాకు మధ్య ఒక సంవత్సరం మాత్రమే తేడా. కానీ తల్లి పాత్ర అని చెప్పగానే ముందుగా రిజెక్ట్ చేశాను. కానీ ఇది ఒక నటిగా చాలా మంచి అవకాశం. నేనెందుకు దీనిని వదులుకోవాలి అనుకున్నాను. అందుకే ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది. రణబీర్ ప్రస్తుత వయస్సు 41 ఏళ్లు. చారూ శంకర్ వయసు 42 ఏళ్లు.

“యానిమల్ సినిమా ఏంటో నాకు ముందే తెలిసిపోయింది. సందీప్ కథ చెప్పగానే.. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా, చాలా భిన్నంగా ఉందని అనుకున్నాను. నువ్వు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నాను. నీ చుట్టూనే కథ తిరుగుతుంది కాబట్టి.. నీ పాత్ర త్వరగా ప్రేక్షకులపై ప్రభావం చూపించేలా ఉండాలి అనుకుంటున్నాను అన్నాడు. ” అని తెలిపింది. సందీప్‌తో మొదటి ఇంటరాక్షన్ గురించి మాట్లాడుతూ.. “నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు జీన్స్, కుర్తా వేసుకున్నాను. ముందుగానే మేము వెళ్లి అక్కడ కూర్చున్నాము. అప్పుడు సందీప్ వచ్చి మమ్మల్ని గమనించకుండానే లోపలికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతని అసిస్టెంట్ పిలిచి మమ్మల్ని ఎవరు అడుగ్గా.. తనే చారూ అని చెప్పడంతో మమ్మల్ని లోపలికి పిలిచాడు. లోపలికి వెళ్లగానే థాంక్స్ చెప్పారు. నేను మరీ యంగ్ గా ఉన్నానని అన్నాడు. ఆ తర్వాత స్టోరీ చెప్పాడు” అంటూ చెప్పుకొచ్చింది చారూ శంకర్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తోటి హీరోలకు మహిళలకు తల్లిగా నటించడం సాధరణమే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.