Vyuham Movie: ‘వ్యూహం’ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ఎప్పుడు రిలీజ్ కానుందంటే.
కేసు హియరింగ్ రోజున లాయర్లు మాట్లాడుతారని అన్నారు. ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందించిన పొలిటికల్ డ్రామా సినిమా 'వ్యూహం'. ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం జరిగింది. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన వర్మ.. వ్యూహం సినిమా రిలీజ్ డేట్ పై ఏర్పడిన సస్పెన్స్ పై స్పందించారు. ఈ సినిమాకు.. రాజకీయాలకు పెద్ద తేడా లేదని అన్నారు. రెండూ కూడా ప్రజలకు సంబంధించినవే అని అన్నారు. మాస్ లో వాటికి చాలా క్రేజ్ ఉందని తెలిపారు.

వ్యూహం సినిమా గందోరగోళంపై వివరణ ఇచ్చారు డైరెక్టర్ ఆర్టీజీ. ఈనెల 29న సినిమా యాధావిధిగా రిలీజ్ అవుతుందని చెప్పారు డైరెక్టర్. తమ సినిమాకు CBFC సర్టిఫై చేసిందని తెలిపారు. కోర్ట్ ఇచ్చింది జస్ట్ ఇంటిరియమ్ ఆర్డర్ మాత్రమే.. పూర్తి స్టే కాదని తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు రిలీజ్ చేయవద్దన్నారు.. కానీ తమ సినిమాను 29న రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కేసు హియరింగ్ రోజున లాయర్లు మాట్లాడుతారని అన్నారు. ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందించిన పొలిటికల్ డ్రామా సినిమా ‘వ్యూహం’. ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం జరిగింది. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన వర్మ.. వ్యూహం సినిమా రిలీజ్ డేట్ పై ఏర్పడిన సస్పెన్స్ పై స్పందించారు. ఈ సినిమాకు.. రాజకీయాలకు పెద్ద తేడా లేదని అన్నారు. రెండూ కూడా ప్రజలకు సంబంధించినవే అని అన్నారు. మాస్ లో వాటికి చాలా క్రేజ్ ఉందని తెలిపారు.
తాను వ్యూహం సినిమాలో ఎక్కడా వక్రీకరించలేదని.. ప్రచారంలో ఉన్న అంశాలనే తన సినిమాలో చూపించానని అన్నారు. తాను ఏం తీశానన్నది సినిమా చూశాక మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 2009 నుంచి 2019 వరకు జగన్ కు సంబంధించిన అన్ని ఘట్టాలు ఈ సినిమాలో ఉంటాయని వివరించారు. టీడీపీని టార్గెట్ చేసి సినిమాలు తీస్తున్నాననడం కరెక్ట్ కాదని.. ఎన్టీఆర్ తన అభిమాన నటుడు అని.. ఆయన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీశానని.. ఇటు వైఎస్సార్ మరణం తర్వాత నెలకొన్న డ్రామా తనను ఆకర్షించిందని.. ఆ ఘటనలతోనే వ్యూహం సినిమా తీసినట్లు వివరాలు.
తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వర్మ వ్యూహం చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీ నేత సెన్సార్ బోర్డును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో తాత్కాలికంగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిలిపేసింది సెన్సార్ బోర్డు. ఆ తర్వాత ఏమనుకుందో ఏమో క్లియరెన్స్ ఇచ్చేసింది. సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ టీడీపీ న్యాయపోరాటానికి దిగింది. ఓటీటీల్లో కూడా విడుదల కాకుండా అడ్డుకోవాలని కోరుతూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఓటీటీల్లో రిలీజ్ కాకుండా ఆదేశాలు ఇచ్చింది. డిసెంబర్ 26న విచారణ జరగనుంది. మరోవైపు శనివారం సాయంత్రం విజయవాడలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ మంత్రులు, నేతలు పాల్గొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




