AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఆ విషయంలో ఏకైక హీరో ప్రభాస్.. రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్..

నీల్ డైరెక్షన్, ప్రభాస్, పృథ్వీ, శ్రియారెడ్డి నటనపై విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత డార్లింగ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో సలార్ హిట్ సెలబ్రెషన్స్ జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లుగా అడియన్స్ వెండితెరపై ప్రభాస్‏ను ఎలా అయితే చూడాలనుకుంటున్నారో.. అంతకు మించి డార్లింగ్ రోల్ ఎలివేట్ చేశాడు నీల్.

Prabhas: ఆ విషయంలో ఏకైక హీరో ప్రభాస్.. రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2023 | 6:59 AM

Share

ప్రస్తుతం సలార్ ఫీవర్ ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతి హాసన్, శ్రియా రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. నీల్ డైరెక్షన్, ప్రభాస్, పృథ్వీ, శ్రియారెడ్డి నటనపై విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత డార్లింగ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో సలార్ హిట్ సెలబ్రెషన్స్ జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లుగా అడియన్స్ వెండితెరపై ప్రభాస్‏ను ఎలా అయితే చూడాలనుకుంటున్నారో.. అంతకు మించి డార్లింగ్ రోల్ ఎలివేట్ చేశాడు నీల్. దీంతో మైండ్ బ్లోయింగ్.. గూస్ బంప్స్ పర్ఫార్మెన్స్ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. మొదటి రోజే ఈ సినిమా రూ. 177 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ప్రభాస్ ఖాతాలో మరో కొత్త రికార్డ్ చేరింది.

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సలార్ రికార్డుల వేట మొదలైంది. మొదటి రోజే రూ.177 కోట్లకు పైగా సాధించింది. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.. అలాగే ఈ ఒక్క ఏడాదిలో ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.100 కోట్లను దాటించిన ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు. కొన్ని నెలల క్రితం ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో వచ్చిన ఆదిపురుష్ సినిమా మొదటి రోజే రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు సలార్ సైతం ఫస్ట్ డే రూ.177 కోట్లు రాబట్టింది. కేవలం ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు విడుదలై మొదటి రోజే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టడం డార్లింగ్‏కు మాత్రమే సాధ్యమైంది.

ప్రభాస్ సినిమాల కోసం పాన్ ఇండియా అడియన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తుంటారు.. ఆదిపురుష్ నిరాశ పరచడంతో ఫ్యాన్స్ ఆశలన్ని సలార్ సినిమాపైనే పెట్టుకున్నాడు. బాహుబలి హిట్ తర్వాత ఆ రేంజ్ సూపర్ హిట్ సలార్ సినిమాతో ఖాతాలో పడింది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా విడుదలైంది. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెకండ్ పార్ట్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.