AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Arul Mohan: టాలీవుడ్‏లో ప్రియాంకకు క్రేజీ ఆఫర్స్.. ఈ ముద్దుగుమ్మ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా ?..

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ ప్రియాంకకు మాత్రం అవకాశాలు రాలేదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ చిత్రంలో నటిస్తుంది. అలాగ నాని నటిస్తోన్న సరిపోదా శనివారం మూవీలోనూ కనిపించనుంది. అటు తమిళంలోనూ ఈ బ్యూటికి అవకాశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 20న ప్రియాంక పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలిపారు.

Priyanka Arul Mohan: టాలీవుడ్‏లో ప్రియాంకకు క్రేజీ ఆఫర్స్.. ఈ ముద్దుగుమ్మ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా ?..
Priyanka Mohan
Rajitha Chanti
|

Updated on: Nov 21, 2023 | 8:40 AM

Share

ప్రియాంక అరుళ్ మోహన్.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్. ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఈ బ్యూటీ బిజీగానే ఉంది. మొదట కన్నడలో తొలిసారిగా నటించిన ప్రియాంక ఆ తర్వాత తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ ప్రియాంకకు మాత్రం అవకాశాలు రాలేదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ చిత్రంలో నటిస్తుంది. అలాగ నాని నటిస్తోన్న సరిపోదా శనివారం మూవీలోనూ కనిపించనుంది. అటు తమిళంలోనూ ఈ బ్యూటికి అవకాశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 20న ప్రియాంక పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంకకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ప్రియాంక తండ్రి తమిళ్.. తల్లి కన్నడ. ఆమె 20 నవంబర్ 1994న చెన్నైలో జన్మించారు. శివకార్తికేయన్ సరసన డాక్టర్ సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తెలుగులో గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది. తమిళంలో మూడు సినిమాలు, తెలుగులో రెండు, కన్నడలో ఒకటి.. ఇలా ఇప్పటివరకు మొత్తం ఆరు సినిమాలు విడుదలయ్యాయి. ఒక్కో సినిమాకు ప్రియాంక రూ.30 నుంచి రూ. 50 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఆస్తి వివరాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

ప్రియాంక సంపాదన మొత్తం రూ.12 కోట్లు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ఇటీవలే చెన్నైలో కొత్త అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఈ బ్యూటీకి పాటలు వినడం ఇష్టం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో వరుసగా నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి ధనుష్ జోడిగా కెప్టెన్ మిల్లర్, తెలుగులో ఓజీ, సరిపోదా శనివారం, తమిళంలో జయం రవి సరసన బ్రదర్ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇవే కాకుండా మరిన్ని చిత్రాల్లోనూ ప్రియాంక నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చేసింది ఆరు సినిమాలే అయినా.. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వివాదం ఎందుకు అన్నందుకు అత్తను ఆమె తల్లిపై దాడి చేసిన అల్లుడు..
వివాదం ఎందుకు అన్నందుకు అత్తను ఆమె తల్లిపై దాడి చేసిన అల్లుడు..
బుధ, శుక్రుల పరివర్తన.. ఆ రాశుల వారికి ప్రేమ, పెళ్లి యోగాలు..!
బుధ, శుక్రుల పరివర్తన.. ఆ రాశుల వారికి ప్రేమ, పెళ్లి యోగాలు..!
రిసార్ట్‌‌కి వెళ్లిన దోస్తులు.. వాష్ రూం నుంచి వింత శబ్దాలు..
రిసార్ట్‌‌కి వెళ్లిన దోస్తులు.. వాష్ రూం నుంచి వింత శబ్దాలు..
రోహిత్‌ ఔట్.. శాంసన్‌ ఇన్.. అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
రోహిత్‌ ఔట్.. శాంసన్‌ ఇన్.. అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. నర్సింగ్ ఆఫీసర్ మృతి..
కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. నర్సింగ్ ఆఫీసర్ మృతి..
చికెన్ ముక్క గొంతులో ఇరుక్క పోయిందా.. ఈ చిట్కాలు మీ కోసమే!
చికెన్ ముక్క గొంతులో ఇరుక్క పోయిందా.. ఈ చిట్కాలు మీ కోసమే!
పుట్టిన తేదీ చెబుతుంది మీ సంపద సమయం.. కోటీశ్వరులు అయ్యే వయసు ఇదే
పుట్టిన తేదీ చెబుతుంది మీ సంపద సమయం.. కోటీశ్వరులు అయ్యే వయసు ఇదే
నాలుగు నెలలుగా ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నాలుగు నెలలుగా ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సూపర్ న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సూపర్ న్యూస్
మరో కొత్త టీం ఎంట్రీ.. ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ స్కెచ్
మరో కొత్త టీం ఎంట్రీ.. ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ స్కెచ్