Siddharth: సిద్ధార్థ్ ‘చిన్నా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..
ఎమోషనల్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు సిద్ధార్థ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం అందుకుంది. అంతేకాకుండా బాబాయ్, కూతురు మధ్య అనుబంధంతో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఇప్పటికే ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. అనుహ్యంగా వాయిదా పడింది.
చాలా కాలం తర్వాత హీరో సిద్ధార్థ్ ఖాతాలో హిట్ అందుకున్న సినిమా ‘చిన్నా’. ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ, తెలుగులో తెరకెక్కించారు డైరెక్టర్ ఎస్యూ. అరుణ్ కుమార్. ఇందులో సహస్ర శ్రీ, నిమిషా సజయన్ నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. ఎమోషనల్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు సిద్ధార్థ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం అందుకుంది. అంతేకాకుండా బాబాయ్, కూతురు మధ్య అనుబంధంతో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఇప్పటికే ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. అనుహ్యంగా వాయిదా పడింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ఈ మూవీ మొదట నవంబర్ 17న స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ తాజాగా నివేదికల ప్రకారం ఈ మూవీని నవంబర్ 28న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
View this post on Instagram
కథ విషయానికి వస్తే..
ఈ సినిమాలో ఈశ్వర్ (సిద్ధార్థ్) అనే పాత్రలో నటించాడు. తన అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపతో జాబ్ చేసుకుంటూ సింపుల్ లైఫ్ గడిపేస్తుంటారు. చిన్న పిల్లల్ని రేప్ చేయడం.. చంపేయడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. అదే సమయంలో ఈశ్వర్ తన ఇంటి దగ్గరే ఉండే మరో పాపతో మాములుగా మాట్లాడినా అది తప్పుగా తీసుకుని ఈశ్వర్ కూడా ఇలాగే చేస్తాడనుకుని అతడిని కొట్టి పోలీసులకు అప్పగిస్తారు. ఆ తర్వాత ఈశ్వర్ అన్ని కూతురు కనిపించకపోవడంతో.. అతని ఫ్రెండ్స్, పోలీసులు పాపను ఎలా పట్టుకున్నారు అనేది సినిమా స్టోరీ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.