Nayanthara: ప్రైవేట్ జెట్ నుంచి లిప్ బామ్ కంపెనీ వరకు.. లేడీ సూపర్ స్టార్ ఎంత సంపాదించిందో తెలుసా ?..
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఈ మూవీతో అటు నార్త్ లోనూ నయన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు బీటౌన్ పై ఫోకస్ పెట్టింది. జవాన్ చిత్రంతో హిందీలో నయనతారకు వరుస అవకాశాలు క్యూకట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ తన పారితోషికం డబుల్ చేసినట్లుగా ప్రచారం నడుస్తోంది. కేవలం జవాన్ చిత్రానికి నయన్ రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం.
భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో నయనతార ఒకరు. సౌత్ అడియన్స్ అంతా ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. తమిళం, తెలుగు భాషల్లో అగ్ర హీరోలందరి సరసన నటించింది నయన్. ఇక ఇటీవలే బాలీవుడ్ బాద్షా షారుఖ్ జోడిగా జవాన్ చిత్రంలో కనిపించింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఈ మూవీతో అటు నార్త్ లోనూ నయన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు బీటౌన్ పై ఫోకస్ పెట్టింది. జవాన్ చిత్రంతో హిందీలో నయనతారకు వరుస అవకాశాలు క్యూకట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ తన పారితోషికం డబుల్ చేసినట్లుగా ప్రచారం నడుస్తోంది. కేవలం జవాన్ చిత్రానికి నయన్ రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం.
ఇదిలా ఉంటే దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది నయన్. 2003లో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె.. రెండు దశాబ్దాల కెరీర్ లో దాదాపు రూ.183 కోట్లు సంపాదించినట్లుగా తెలుస్తోంది. మ్యాజ్ బ్రిక్స్ . కామ్ నివేదించిన ప్రకారం, నయనతార హైదరాబాద్, చెన్నై, కేరళతో సహా నగరాల్లో అనేక భవనాలను కలిగి ఉందట. కేరళలోని అత్యంత విలాసవంతమైన ఆస్తులలో నయనతార పూర్వీకుల ఇల్లు ఒకటి. మిగతా రెండు హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న ప్రాంతమైన బంజారాహిల్స్ పరిసరాల్లో ఉన్నాయి. నయనతార తన భర్త విఘ్నేష్ శివన్, కుమారులతో కలిసి నివసిస్తోన్న ఇళ్లు చెన్నైలోని విశాలమైన భవనాలలో ఒకటి. ఆ ఇంటి విలువ దాదాపు రూ.100 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే నయనతార ముంబైలో సీ వ్యూ ఫ్లాట్ కొనుగోలు చేసింది.
ప్రైవేట్ జెట్..
ది ఎకనామిక్ టైమ్స్ నివేదించిన ప్రకారం, నయనతార కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసింది. అల్లు అర్జున్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అక్కినేని నాగార్జున దక్షిణ భారతదేశంలో ప్రైవేట్ జెట్ విమానాలను కలిగి ఉన్నారు.
View this post on Instagram
లగ్జరీ కార్లు..
నయనతారకు చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆమె గ్యారెజీలో బిఎమ్‌డబ్ల్యూ 5 ఎస్, మెర్సిడెస్ జిఎల్‌ఎస్ 350 డి, ఫోర్డ్ ఎండీవర్, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, ఇన్నోవా క్రిస్టా కూడా ఉన్నాయి.
సొంతంగా నిర్మాణ సంస్థ..
నయన్.. తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి 2011లో రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్ పై కూజమాల్ (2021), నేత్రికన్ (2021), కడకతువకుళ్ల ఊయ కథల్ (2022) చిత్రాలను నిర్మించారు. ఈ కంపెనీ ఆస్తులు దాదాపు రూ.50 కోట్లు.
వ్యాపార రంగంలో నయన్..
నయనతార 2019లో డాక్టర్ రెనిటా రాజన్‌తో కలిసి ‘ది లిప్ బామ్ కంపెనీ’ని ప్రారంభించింది. అలాగే నయన్ సొంతంగా స్కిన్ కేర్ బ్రాండ్ కలిగి ఉన్నారు. ఇప్పటికే దీపిక పదుకొణె స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వ్యాపారంలో ముందున్నారు. అలాగే 2021లో లిప్ బామ్ కంపెనీ ప్రారంభించారు నయన్. ఈ కంపెనీ మార్కెట్లో 100 కంటే ఎక్కువ వివిధ లిప్ బామ్‌లను అందిస్తుంది. ఇటీవల నయన్ 9 స్కిన్ బ్రాండ్ పేరుతో చర్మ సంరక్షణ ఉత్పత్తులను కూడా విడుదల చేసింది. అలాగే ఆమెకు టీ అమ్మే స్నాక్ స్టోర్ బ్రాండ్ ‘చాయ్ వాలా’లో కూడా వాటా ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.