Samantha: ‘ఎక్కువ బాధ కలిగినప్పుడల్లా ఈ సినిమా చూస్తాను.. ప్రపంచం నుంచి తప్పించుకుంటాను’.. సమంత పోస్ట్..

కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. ఇప్పుడు ఆ వ్యాధికి పూర్తిగా చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్లింది. అయితే ఈ చికిత్స కోసం ముందుగా ఆమె మానసిక ప్రశాంతత కోసం ట్రావెలింగ్ పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే తన మనసుకు నచ్చిన ప్రదేశాలకు.. ఎప్పటినుంచో వెళ్లాలనుకున్న చోటికి వెళ్లిపోతుంది. ఇప్పుడు తన కలలన్ని నిజం చేసుకుంటుంది. అయితే చిన్నప్పటి నుంచి తాను చూడాలని కలలు కన్న అన్ని ప్రాంతాలను ఇప్పుడు చుట్టేస్తున్న సామ్.. ఇప్పుడు ఆస్ట్రియాలోని సాల్జ్ బర్గ్ వెళ్లారు.

Samantha: 'ఎక్కువ బాధ కలిగినప్పుడల్లా ఈ సినిమా చూస్తాను.. ప్రపంచం నుంచి తప్పించుకుంటాను'.. సమంత పోస్ట్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 24, 2023 | 5:47 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చివరిసారిగా ఖుషి చిత్రంలో నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత సామ్ కెరీర్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. ఇప్పుడు ఆ వ్యాధికి పూర్తిగా చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్లింది. అయితే ఈ చికిత్స కోసం ముందుగా ఆమె మానసిక ప్రశాంతత కోసం ట్రావెలింగ్ పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే తన మనసుకు నచ్చిన ప్రదేశాలకు.. ఎప్పటినుంచో వెళ్లాలనుకున్న చోటికి వెళ్లిపోతుంది. ఇప్పుడు తన కలలన్ని నిజం చేసుకుంటుంది. అయితే చిన్నప్పటి నుంచి తాను చూడాలని కలలు కన్న అన్ని ప్రాంతాలను ఇప్పుడు చుట్టేస్తున్న సామ్.. ఇప్పుడు ఆస్ట్రియాలోని సాల్జ్ బర్గ్ వెళ్లారు. అక్కడ తనకెంతో ఇష్టమైన లొకేషన్స్ సందర్శించారు. అక్కడ దిగిన ఫోటోలను ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు.

“చిన్నప్పుడు ఎప్పుడైన ఎక్కువ సంతోషం కలిగినా.. బాధగా అనిపించినా అప్పుడు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా చూస్తూ ఈ ప్రపంచం నుంచి తప్పించుకునేదాన్ని. వాస్తవానికి దూరంగా ఒక అద్భుత ప్రపంచంలోకి ఈ సినిమా నన్ను తీసుకెళ్లేది. నాకు ఇది ఆధ్యాత్మిక ప్రదేశాం.. ఎప్పుడైన మనం చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూస్తుంటే దానిపై మన అభిప్రాయం మారుతుంటుంది. కానీ ఈ మూవీని ఎప్పుడూ చూసిన ఒకే విధమైన భావన కలుగుతుంది. నా చిన్ననాటి రోజులను గుర్తుచేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ సినిమా లొకేషన్స్ లో ఉన్నాను. ఇదే ఇప్పుడు నన్నెంతో భావోద్వేగానికి గురి చేస్తుంది” అంటూ సామ్ తన ఇన్ స్టా లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఖుషి సినిమాతోపాటు.. బాలీవుడ్ లో సామ్ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేశారు. ఇందులో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించగా.. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ జోడిగా సామ్ నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..గుర్తుపట్టారా?
శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..గుర్తుపట్టారా?
రూ.5 లక్షల పెట్టుబడి ద్వారా రూ. 15 లక్షల సంపాదన.. సువర్ణావకాశం!
రూ.5 లక్షల పెట్టుబడి ద్వారా రూ. 15 లక్షల సంపాదన.. సువర్ణావకాశం!
అరటి, బొప్పాయిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
అరటి, బొప్పాయిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ఇదిగో..
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ఇదిగో..
ఒక్క టీ ట్రీ ఆయిల్‌ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చా..
ఒక్క టీ ట్రీ ఆయిల్‌ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చా..
నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
లోయర్‌ బెర్త్‌ కోసం టికెట్‌ బుక్‌ చేస్తున్నారా? రైల్వే నిబంధనలు!
లోయర్‌ బెర్త్‌ కోసం టికెట్‌ బుక్‌ చేస్తున్నారా? రైల్వే నిబంధనలు!
వరుస పరాజయాలతో గంభీర్ ఆగమాగం.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఎఫెక్ట్
వరుస పరాజయాలతో గంభీర్ ఆగమాగం.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఎఫెక్ట్
తస్సాదియ్యా.. ఆ చిన్నారి ఈ అమ్మాయా..? అందాల అరాచకమే..
తస్సాదియ్యా.. ఆ చిన్నారి ఈ అమ్మాయా..? అందాల అరాచకమే..
నాలుకతో 57 తిరిగే ఫ్యాన్స్‌ని ఆపి రికార్డ్ సాధించిన వ్యక్తి..
నాలుకతో 57 తిరిగే ఫ్యాన్స్‌ని ఆపి రికార్డ్ సాధించిన వ్యక్తి..