AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudha Chandran: 17 ఏళ్ల వయసులోనే అనుకోని ప్రమాదం.. కుటుంబాన్ని ఎదురించి ప్రేమ..పెళ్లి.. ‘మయూరి’ సినిమా హీరోయిన్ గుర్తుందా ?..

ప్రస్తుతం బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సుధా చంద్రన్. నాగిని సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చారు సుధా. అలాగే ఝరక్ దిఖ్లా జా, షాదీ కర్కే ఫాస్ గయే యార్ వంటి ధారవాహికలలో పనిచేశారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సుధా చంద్రన్ జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు.

Sudha Chandran: 17 ఏళ్ల వయసులోనే అనుకోని ప్రమాదం.. కుటుంబాన్ని ఎదురించి ప్రేమ..పెళ్లి.. 'మయూరి' సినిమా హీరోయిన్ గుర్తుందా ?..
Sudha Chandran
Rajitha Chanti
|

Updated on: Apr 16, 2023 | 10:38 AM

Share

వెండితెరపై ఎంతో మంది జీవితకథలను తీసుకువచ్చారు దర్శకనిర్మాతలు. దేశంలోని ప్రముఖుల జీవిత కథల ఆధారంగా వచ్చిన చిత్రాల్లో పలువురు స్టార్స్ నటించి మెప్పించారు. కానీ తన కథకు తానే హీరోయిన్‏గా నటించింది సుధా చంద్రన్. పదిహేడేళ్ల వయసులోని అనుకోని ప్రమాదం జీవితాన్ని కుదిపేసిన.. ఆత్మ విశ్వాసం తన కలను నిజం చేసుకుంది. ప్రస్తుతం బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సుధా చంద్రన్. నాగిని సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చారు సుధా. అలాగే ఝరక్ దిఖ్లా జా, షాదీ కర్కే ఫాస్ గయే యార్ వంటి ధారవాహికలలో పనిచేశారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సుధా చంద్రన్ జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు.

సుధా చంద్రన్ 1965 సెప్టెంబర్ 27న ముంబైలో జన్మించారు. ఆమె భారతనాట్య నృత్యకారిణి. 1981లో మద్రాసు నుంచి తన తల్లిదండ్రులతో కలిసి వస్తుండగా.. తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె కాలికి గాయమైంది. దీంతో ఆమె కాలు గ్యాంగ్రీనస్ గా మారడంతో మోకాలి వరకు ఆమె కాలు తొలగించారు వైద్యులు. దీంతో చిన్నప్పటి నుంచి నాట్యం పై ఉన్న మక్కువతో ఆమె నేర్చుకున్న భారత్య నాట్యానికి దూరమైంది. కానీ ఆమె ఆత్మ ధైర్యంతో ఎలాగైనా నృత్యం చేయాలనుకుంది. సింథటిక్ లెగ్‏తో తన నృత్య శిక్షణను కొనసాగించింది. భారతనాట్యంలో ఎన్నో అవార్డ్ అందుకున్నారు. ఆమె జీవితకథ ఆధారంగా వచ్చిన మయూరి సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ మూవీ 1984లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సుధా చంద్రన్ వెనుదిరిగి చూడలేదు.

ఇవి కూడా చదవండి

1992లో సీతా.. సల్మా.. సుజీ సినిమా సెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ రవి డాంగ్ ను కలిశారు. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. వీరిద్దరు కొన్ని రోజులు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లి ఇరువురు కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో వారిని ఎదురించి వీరు చెంబూరులోని ఓ గుడిలో తమిళ ఆచారాల ప్రకారం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సుధా చంద్రన్ సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.