SSMB 28: మహేష్ బాబు చిత్రాన్ని వదలని లీకుల బెడద.. నెట్టింట హల్చల్ చేస్తోన్న మరో పిక్..
మహేష్ బాబుతో పాటు పూజా హెగ్డే కూడా షూటింగ్ లో పాల్గోంటున్నారు. అయితే ముందు నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా గత కొద్ది నెలలుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుతో పాటు పూజా హెగ్డే కూడా షూటింగ్ లో పాల్గోంటున్నారు. అయితే ముందు నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అందులో మహేష్ లుక్ కూల్ అండ్ డీసెంట్ గా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా క్యూట్ గా లంగావోణిలో కనిపిస్తున్నారు. మహేష్, పూజా కాంబోలో సీన్ అయ్యింటుందని తెలుస్తోంది. ఇద్దరూ కూడా సన్నివేశంకు సంబంధించిన చర్చల్లో సీరియస్ గా లీనమై ఉన్నారు. ఈ ఫోటో చూస్తూ ఉంటే అతడు చిత్రంలో మహేష్, త్రిషను చూసినట్లుందని కామెంట్స్ చేస్తున్నారు.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు.. రాజమౌళి కాంబోలో సినిమా పట్టాలెక్కనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.