AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agent Movie: డైరెక్టర్‏తో మనస్పర్థలు.. కోపంతో వెళ్లిపోయిన సురేందర్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చిన అక్కినేని అఖిల్..

స్పై థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది సాక్షి. అలాగే ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదల కానుంది.

Agent Movie: డైరెక్టర్‏తో మనస్పర్థలు.. కోపంతో వెళ్లిపోయిన సురేందర్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చిన అక్కినేని అఖిల్..
Akkineni Akhil
Rajitha Chanti
|

Updated on: Apr 16, 2023 | 9:22 AM

Share

అక్కినేని అఖిల్ కెరియర్‎లో పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న చిత్రం ఏజెంట్. స్పై థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది సాక్షి. అలాగే ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. తాజాగా నిన్న ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. అందులో సినిమా ఇంత ఆలస్యం కావడానికి గల కారణాలే కాకుండా.. ఏజెంట్ సినిమా పై వచ్చిన రూమర్స్ పై స్పందించారు హీరో అఖిల్.

“ఏజెంట్ సినిమా ఆగిపోయింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డికి కోపం వచ్చి వెళ్లిపోయాడు అనే వార్తలు చాలా రాశారు. మేం అదే రోజు ఈ షాట్ సూపర్ చేశామని అనుకునే సమయంలో ఇలాంటి వార్తలు మా దృష్టికి వచ్చేవి. వాటిని చూసి మేం సరదాగా నవ్వుకునేవాళ్లం. ఏజెంట్ సినిమా రెండేళ్ల ప్రయాణం. సాధారణంగా ఈ రెండేళ్ల ప్రయాణంలో టీంలో ఒత్తిడి ఉండదంటారా. మన కుటుంబం అన్నాక గొడవలు రావా ? ఫ్యామిలీ సభ్యులు ఒకరినొకరు తిట్టుకోరా ? అలాగే మా టీంలోనూ జరిగాయి.. తిట్టుకోవడం కాదు.. కాస్త్ స్ట్రెస్ ఉంది. కానీ ప్రతి జర్నీ ఎంజాయ్ చేశాం” అంటూ చెప్పుకొచ్చారు అఖిల్.

ఇవి కూడా చదవండి

అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “కరోనా కారణంగా నేను ఆరు నెలలు ఆసుపత్రిలో ఉన్నారు. అది కూడా బుడాపెస్ట్. దాదాపు ఏడాదిన్నర సమయం వేస్ట్ అయ్యింది. నేను వెళ్లిపోయి వచ్చాను. కష్టపడితేనే లేటే అయ్యిందని అంటున్నారు. చెప్పకూడని సమస్యలెన్నో సినిమాకు వచ్చాయి. సినిమా కోసం మేము కష్టపడింది 100 రోజులు మాత్రమే. బుడాపెస్ట్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు కరోనా వచ్చి 20 రోజులు వెంటిలేటర్ పైనే ఉన్నాను. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. నన్ను టీమ్ ఎలా కాపాడుకుందో నాకు మాత్రమే తెలుసు” అని అన్నారు.

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!