Super Star: బంధువుల ఇంట్లో పనిమనిషిగా పనిచేసి.. ఇండస్ట్రీలో ఫస్ట్ లేడీ సూపర్ స్టార్.. ఎవరో తెలుసా..?
భారతీయ సినీపరిశ్రమలో ఇప్పుడు లేడీ సూపర్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నత స్థాయిలో దూసుకుపోతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఇప్పుడు నయనతార తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ ఎవరో తెలుసా.. ?

ఇండస్ట్రీలో చాలా మంది మహిళలు తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు స్టార్ హీరోలకు పోటీగా పారితోషికం తీసుకుంటూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నారు. లేడీ సూపర్ స్టార్స్ అనగానే విజయశాంతి నుంచి ఇప్పుడు నయనతార, అనుష్క వంటి స్టార్స్ గుర్తుకు వస్తారు. కానీ మీకు తెలుసా.. ? భారతీయ సినీరంగంలో ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ ఎవరో.. ? ఆమె ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ లేడీ స్టార్.. ఆమె మరెవరో కాదు.. కానన్ దేవి. ఆమె బెంగాలీ సినిమాకు మొదటి సూపర్ స్టార్ అనే బిరుదును సైతం సొంతం చేసుకుంది. అంతేకాకుండా అప్పట్లో ఆమెను అందరూ మెలోడీ క్వీన్ అని పిలిచేవారు. కానన్ దేవి.. బహుముఖ ప్రజ్ఞాశాలి. గాయని, చిత్రనిర్మాత.
అందమైన రూపం, అద్భుతమైన నటన, మధురమైన స్వరం, భావోద్వేగ నటన, ధైర్యమైన వ్యక్తిత్వం అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. 1916 ఏప్రిల్ 22న పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జన్మించిన కనన్ దేవి చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పెరిగారు. 10 ఏళ్ల వయసులో తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ కోసం బంధువుల ఇంట్లో పనిమనిషిగా పనిచేసింది. అదే సమయంలో ఒక స్నేహితుడి సాయంతో నిశ్శబ్ద సినిమాలో అవకాశం అందుకుంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 1926 విడుదలైన జైదేవ్ సినిమాతో మరోసారి పాపులర్ అయ్యింది. అప్పుడు ఆమెకు కేవలం రూ.5 మాత్రమే జీతం లభించింది.
కానన్ దేవి.. టాకీ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ముద్ర వేసుకుంది. ఆ తర్వాత ‘జోర్పరత్’ (1931), ‘మా’ (1934), ‘మనోమై గర్ల్స్ స్కూల్’ (1935) వంటి చిత్రాలలో నటించారు. ‘ముక్తి’ (1937), ‘విద్యాపతి’ (1937) చిత్రాల విజయం ఆమెకు సూపర్ స్టార్ హోదాను కల్పించాయి. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది కానన్ దేవి. సొంతంగా శ్రీమతి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు చిత్రాలు నిర్మించింది. బెంగాలీ సాహిత్యం ఆధారంగా అనేక చిత్రాలను నిర్మించి మొట్ట మొదటి మహిళా చిత్రనిర్మాతగా మారింది.
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
మూడు దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన కానన్ దేవి.. 1968లో పద్మ శ్రీ, 1976లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. నటిగా కెరీర్ సాఫీగా సాగినప్పటికీ ఆమె వైవాహిక జీవితం మాత్రం పలు ఇబ్బందులు ఎదుర్కోంది. ఆమె మొదట ప్రసిద్ధ బ్రహ్మ సమాజ్ విద్యావేత్త హరంబా చంద్ర మైత్రా కుమారుడు అశోక్ మైత్రాను వివాహం చేసుకున్నారు. కానీ ఐదేళ్లకే వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆమె హరేంద్రనాథ్ చక్రవర్తిని రెండవసారి వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆమె 1992లో మరణించారు.
ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..




