ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికేసింది మావ..! ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘RRR’ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఇందులోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. జేమ్స్ కెమరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి ప్రముఖ దర్శకులు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని ప్రశంసించారు.

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమా పాన్ గ్లోబల్ లెవల్ లో ఉంటుందని తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది.
ఇది కూడా చదవండి : అప్పుడు ఆవేశంలో ఆత్మహత్య చేసుకుందామనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్
హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమా చూసి మెచ్చుకున్నారు. రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. అలాగే ఈ సినిమాలో మల్లి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గోండు పిల్లగా నటించిన మల్లీ పాత్ర సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. ఆ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా.? సినిమా మొదలవడంతోనే కొమ్మ ఉయ్యాలా అంటూ పాట పాడుతూ ప్రేక్షకుల అలరించింది ఆ చిన్నారి.
ఇది కూడా చదవండి :బాబోయ్.. ! ఈ ఫొటోలో ఉంది ఆ స్టార్ హీరోయినా..!! అస్సలు ఊహించలేరు గురూ..
ఆమె పేరు ట్వింకిల్ శర్మ. డాన్స్ ఇండియా షో ద్వారా పాపులర్ అయ్యింది ఈ చిన్నది.. ట్వింకిల్ శర్మ చాలా టీవీ షోల్లో కనిపించింది. అలాగే ఎన్నో డాన్స్ షోలు కూడా చేసింది. వీటితో పాటు ఫ్లిప్ కార్డ్ యాడ్‌లోనూ కనిపించింది. ఆర్ఆర్ ఆర్ సినిమా మొదలైనప్పుడు ఆమె ఎనిమిదో తరగతి చదువుతుందట.. సినిమా పూర్తయ్యే సమయానికి ఇంటర్ పూర్తయ్యింది. 2022లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది. ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందని అందరూ సోషల్ మీడియాలో సర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.
ఇది కూడా చదవండి : అతను నా శరీరంలో అక్కడ చెయ్యివేశాడు.. పోలీసులకు చెప్తే ఇలా అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







